Rangeela Re Release: 'రంగీలా' రీ-రిలీజ్.. జెన్‌-జీ కిడ్స్ కు కూడా కనెక్ట్ అవుతోంది– రామ్‌గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ తన క్లాసిక్ సినిమా 'రంగీలా' మళ్లీ థియేటర్లలో విడుదల కానుండటంపై ఉత్సాహంగా ఉన్నారు. ఆమిర్ ఖాన్, ఉర్మిళా నటించిన ఈ ప్రేమకథ ఈ రోజుల్లో కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని, ముఖ్యంగా Gen Z కూడా దీనికి కనెక్ట్ అవుతారని ఆయన నమ్ముతున్నారు.

New Update
Rangeela Re Release

Rangeela Re Release

Rangeela Re Release: దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తన క్లాసిక్ హిట్‌ 'రంగీలా' థియేటర్లలో మళ్లీ విడుదల కానుండటంపై చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆమిర్ ఖాన్, ఊర్మిళ మతోండ్కర్ నటించిన ఈ సినిమా విడుదలై చాలా ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉండటం చాలా ఆనందంగా ఉందని ఆర్జీవీ తెలిపారు.

రంగీలా ఎందుకు స్పెషల్?

సినిమా నిర్మాణ రోజుల్ని గుర్తుచేసుకుంటూ వర్మ మాట్లాడుతూ, “కొన్ని సినిమాలు వచ్చిన తర్వాత సంవత్సరాలు గడిచినా వాటి గురించి మాట్లాడుతూనే ఉంటారు. రంగీలా కూడా అలాంటి సినిమా. ముఖ్యంగా ఆ సినిమాలో పాటలు ఎలా తీశారో, ఎలా చూపించారో అప్పటి ప్రేక్షకులకైనా, ఇప్పటి ప్రేక్షకులకైనా కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు చాలా కాలం మాట్లాడుకోవడానికి పుడతాయి.. రంగీలా అలాంటిది,” అని అన్నారు.

Also Read: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నార్త్ అమెరికా బుకింగ్స్‌ షురూ! ఎప్పటినుండంటే..?

Also Read: జపాన్‌లో ప్రభాస్ హంగామా.. 'బాహుబలి: ది ఎపిక్' రీ–రిలీజ్‌ స్పెషల్!

రంగీలా సంగీత చిత్రాలకు కొత్త స్టైల్‌ తీసుకువచ్చిందని కూడా ఆయన చెప్పారు. పాటల చిత్రీకరణ, కథలోని ప్రేమను చూపించిన తీరు చాలా సహజంగా ఉండటం వల్ల ఆ పాత్రలు కాలానికి అతీతంగా నిలిచాయని వర్మ అభిప్రాయపడ్డారు. జాకీ ష్రాఫ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

Also Read: ప్రభాస్ ప్రాజెక్ట్స్ నుండి అందుకే తప్పుకున్నా: దీపికా పదుకొణె

జెన్ Z ఎలా స్పందిస్తారో చూడాలని వర్మ ఆసక్తి

సినిమా మళ్లీ థియేటర్లలోకి రానుండడంతో, ఈ తరం యువత, ముఖ్యంగా Gen Z ప్రేక్షకులు దీనిని ఎలా స్వీకరిస్తారో వర్మ తెలుసుకోవాలని చూస్తున్నారు. “Gen Z ఎలా రియాక్ట్ అవుతారో నేను ఊహించలేను. కానీ కథ చాలా సింపుల్, అందరికీ దగ్గరగా అనిపించే విధంగా ఉంటుంది. ఇదే కథ ఇప్పుడు తీసినా కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అందుకే వాళ్లు కూడా సినిమాని ఇష్టపడతారని నా నమ్మకం,” అని ఆయన చెప్పారు.

Also Read: కథ చెబుతానని పిలిచి ఆ డైరెక్టర్ బలవంతం చేసాడు: మౌనీ రాయ్

కాలాన్ని దాటి నిలిచిన ప్రేమకథ

రంగీలా విడుదలైనప్పుడు సంగీతం, విజువల్స్, నటన అన్నీ అద్భుతంగా నిలిచాయి. ఇక ఇప్పుడు కొత్త తరానికి కూడా అదే అనుభూతి వస్తుందా అన్న ప్రశ్న అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. వర్మ మాత్రం థియేటర్లలో రంగీలా మళ్లీ విడుదల కావడం తనకు మళ్లీ ఆ రోజులను గుర్తుచేస్తోందని చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు