Villain Role : రాజమౌళి, రానా విలన్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా?

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి విలన్ పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. ఈ పాత్రతో రానాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయితే రాజమౌళి, మహేశ్ కాంబోలో వస్తున్న సినిమాలో రానా విలన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
FotoJet (8

టాలీవుడ్ హీరో విలన్ రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే ఎక్కడైనా నటిస్తాడు. నాయకుడు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రానా అవలీలమైన పాత్రలను ఎన్నో పోషించాడు. హీరోతో పాటు విలన్‌గా నటించినా.. ఎక్కువగా విలన్ పాత్రల ద్వారా రానాకు గుర్తింపు వచ్చింది.

ఇది కూడా చూడండి:  Trafficహైదరాబాద్ -​ విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

మరోసారి విలన్‌గా?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియాగా ప్రభాస్ ఎంత పాపులర్ అయ్యారో.. రానా కూడా ఈ సినిమాతో విలన్‌గా చాలా గుర్తింపు సంపాదించుకున్నాడు. బాహుబలిలో భల్లాల దేవ పాత్రలో నటించిన రానా.. ఇటీవల విడుదలైన వెట్టయాన్ రజనీకాంత్ సినిమాలో కూడా విలన్‌గా కనిపించాడు. ఈ సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయిన మంచి రోల్ అని చెప్పుకోవచ్చు. 

ఇది కూడా చూడండి: పట్టాలు తప్పిన మరో రైలు.. 24 గంటల వ్యవధిలో మూడో ప్రమాదం..!

ఇదిలా ఉండగా.. రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో రానా విలన్‌గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రానాని అడగడంతో తను కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై SSMB 29 టీం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమాలో రానా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. 

ఇది కూడా చూడండి: Hyderabad : మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే!

ఈ మూవీలో ఆఫ్రికాలోని మసాయి తెగకు చెందిన ఓ కీలక పాత్రలో రానా కనిపించనున్నట్లు సమాచారం. కేవలం రాజమౌళి కోసమే రానా విలన్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది.ఎందుకంటే రాజ‌మౌళి నిర్వహిస్తున్న అన్ని వ‌ర్క్ షాపుల‌కు కూడా రానా హాజ‌ర‌ు కావడంతో ఈ టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాలో విలన్ పాత్ర.. భల్లాల దేవ అంతా గుర్తింపు ఇస్తుందో లేదో చూడాలి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇది కూడా చూడండి: దీపావళికి ప్రయాణం చేసేవారికి శుభవార్త.. ఈ తేదీల్లో తగ్గిన ఛార్జీలు

Advertisment
Advertisment
తాజా కథనాలు