Nandamuri Mokshagna : మోక్షజ్ఞకు తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్..? ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మోక్షజ్ఞ తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన కనిపించనున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. By Anil Kumar 01 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మోక్షు బర్త్ డే రోజు ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ వదిలారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ సినిమా గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందనున్న ఈ సినిమా మైథలాజికల్ జోనర్ లో ఉండబోతుంది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీ కోసం స్టార్ కాస్ట్ ను తీసుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ మోక్షజ్ఞ తల్లిగా కనిపించనున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన అని సమాచారం. Reports suggest that veteran actress #Shobana will play #NandamuriMokshagna’s mother in the debut film. pic.twitter.com/KqV5Mq5BPh — CHITRAMBHALARE (@chitrambhalareI) October 18, 2024 Also Read : ఇలియానా బర్త్ డే స్పెషల్.. ఆ చిన్న తప్పుతో కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్ మోక్షుకు తల్లిగా శోభన.. కథ ప్రకారం ఈ చిత్రంలో తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉండగా.. ఆ పాత్రకు సీనియర్ నటి శోభన అయితే సరిగ్గా సూట్ అవుతుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భావించారట. దీంతో రీసెంట్ గా ఈ విషయమై శోభనను సంప్రదించగా ఆమె మోక్షజ్ఞకు తల్లిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. Also Read : ఆ స్టార్ హీరోతో పొలిటికల్ మూవీ.. 2029 ఎన్నికలే టార్గట్ : నాగవంశీ #mokshagna-movie #mokshagna-nandamuri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి