/rtv/media/media_files/2025/09/20/ram-charan-sukumar-2025-09-20-11-10-05.jpg)
Ram Charan - Sukumar
Ram Charan - Sukumar: టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు తెరకెక్కించడమే కాకుండా తన బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ ద్వారా ప్రొడ్యూసర్‌గానూ బిజీగా ఉన్నారు. ఆయన నిర్మాతగా ప్రయాణం ప్రారంభించి దాదాపు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ దశలో ‘కుమారి 21ఎఫ్’, ‘ఉప్పెన’, ‘విరూపాక్ష’, ‘18 పేజెస్’, ‘గాంధీ తాత చెట్టు’ వంటి మంచి విజయాల్ని అందించారు.
విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా “పెద్ధి”..
ఇప్పుడు రాబోయే రెండు సంవత్సరాల్లో, సుకుమార్ తన బ్యానర్ ద్వారా ఆరు కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందులో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెద్ధి”(Peddi) అనే సినిమా కాగా. ఈ చిత్రం ఒక విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది . ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నాడు.
పల్లెటూరి వాతావరణంలోని భావోద్వేగాలు, క్రీడల నేపథ్యంలో నడిచే ఈ కథపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ప్రెజెంట్ చేస్తున్నారు. సినిమా 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
ఇక ఈ “పెద్ధి” తర్వాత, సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో మరో సినిమా కూడా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సుకుమార్ డైరెక్టర్‌గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని సమాచారం. అంతేగాక, ప్రీ విజువలైజేషన్ స్టేజ్‌కి కూడా సినిమా చేరుకుంది.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఈ ప్రాజెక్ట్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నుంచి ఇంకా మరెన్నో సినిమాలు సెట్స్‌పైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. ఫైనల్ గా, సుకుమార్ - చరణ్ కాంబినేషన్ మరోసారి థియేటర్లలో మ్యాజిక్ క్రియేట్ చేయనున్నట్టు కనిపిస్తోంది. అభిమానులు ఇప్పటి నుంచే ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.