పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. Also Read: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్ మరో వైపు రామ్ చరణ్ "ఉప్పెన" ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో "ఆర్‌సీ 16" మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో జగపతి బాబు, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, మిర్జాపూర్ సిరీస్ నటుడు దివ్యేందు తదితరులు నటిస్తున్నారు. #RC16 షూటింగ్ జూబ్లీ హిల్స్ బూత్ బంగ్లా లో జరుగుతోంది...క్రికెట్ మాచ్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు...Ram Charan 💥 #RamCharan #GameChanager pic.twitter.com/nB0tM7jKtJ — Aℓω︎α︎yѕ🕊️ (@ALWAYSRAM16) December 11, 2024 Also Read: ఆ ఏడాదికి భారత్‌కు సొంతంగా స్పేస్ స్టేషన్ అంతేకాకుండా ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇటీవలే కర్ణాటకలోని మైసూర్‌లో షూటింగ్ ప్రారంభం అయింది. అనంతరం ఆ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. The Journey of RC16 Begins...Feeling grateful nd blessed 🙏🏽 pic.twitter.com/r9QJC8X1Bq — BuchiBabuSana (@BuchiBabuSana) March 22, 2024 Also Read: ఆ ఏడాదికి భారత్‌కు సొంతంగా స్పేస్ స్టేషన్ బూత్ బంగ్లాలో షూటింగ్ ఇక ఇప్పుడు ఆర్సీ 16 టీం హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఒక బూత్ బంగ్లాలో క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ షూటింగ్‌లో రామ్ చరణ్, సహా జాన్వీ కపూర్ సైతం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 25 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. Also Read: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్