chiranjeevi : చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రేమా? వైరల్ అవుతున్న వీడియో

బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ పంచుకున్న విషయాలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో తన తండ్రి.. తనను కళ్యాణ్ అని, కళ్యాణ్ బాబాయినేమో చరణ్ అని పిలుస్తాడని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో చూసి ఫ్యాన్స్..పవన్ అంటే చిరుకి ఎంత ప్రేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

New Update
chiru pawan

chiru pawan

బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా తన కూతురు క్లీంకార చేసే అల్లరి గురించి చరణ్ చెప్పిన సంగతులు అందరినీ ఇట్టే కట్టి పడేస్తున్నాయి. క్లీంకార రాకతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని, ఆ టైంలో 'RRR' షూటింగ్ ఉండటం.. ఎక్కువగా ఖాళీ టైం దొరకడంతో క్లీంకారతోనే ఎక్కువగా ఉండే వాడ్ని అని చెప్పుకొచ్చాడు. 

షోలో రామ్ చరణ్ తన పర్సనల్ విషయాలెన్నో పంచుకున్నాడు. తన చిన్నతనంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్, నాగబాబుతో గడిపినట్టుగా రామ్ చరణ్ తెలిపాడు. తనను బయటకు తీసుకెళ్లడం, హార్స్ ట్రైనింగ్ ఇప్పించడం ఇలా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకునేవాడట. 

Also Read : మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్.. థియేటర్స్ లో 'ఓజీ' టీజర్.!

ఇక ఇంట్లో నిన్ను అందరూ ఎలా పిలుస్తారని అడిగితే.. నాగ బాబాయ్ చరణ్ బాబు అంటాడు, కళ్యాణ్ బాబాయ్ 'రేయ్ చరణ్' అని పిలుస్తారు.. నాన్న గారు మాత్రం చెర్రీ అని పిలుస్తారు. ఒక్కసారి ఆయన పేర్లు మర్చి పిలుస్తారు. నన్నేమో హే, కళ్యాణ్ అంటారు, మా కళ్యాణ్ బాబాయినేమో రేయ్ చరణ్ అంటాడు. అలా మా ఇద్దరి పేర్లు కన్ఫ్యూజ్ అవుతారు. ఆయన అలా అందుకు అవుతారో అర్థం కాదని చెప్పుకొచ్చాడు. 

https://www.facebook.com/reel/3976183109369106

ఇదే షోలో తమ ఫ్యామిలీతో బాలయ్య కున్న బాండింగ్ గురించి మాట్లాడుతూ..' 1992 టైంలో తాము చెన్నై నుంచి హైద్రాబాద్ కి వచ్చిన టైంలో ఇక్కడ తమకేమీ తెలియదని, అప్పుడు బాలయ్య తమ ఇంటికి వచ్చి.. 'ఏయ్ బ్రదర్ చిరంజీవి కిందకు రా.. మీ అబ్బాయిని పంపించు.. అలా బయటకు తీసుకెళ్లా మా పిల్లలతో పాటుగా తిరిగి వస్తానని' చెప్పి తనను తీసుకెళ్ళినట్లు చెప్పాడు. ఆ టైంలో వాళ్ళ పిల్లలతో నన్ను కూడా బయటకు తీసుకెళ్లి, రెస్టారెంట్లలో తినిపించడం నాకు ఇంకా గుర్తుంది అంటూ చరణ్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

Also Read : ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు