గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్, నెటిజన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించారు. మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో రామ్ చరణ్ షేడ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా మూవీలోని చరణ్ లుక్స్‌తో పాటు ఆయన స్టైల్, స్వాగ్, డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి. ట్రైలర్ చూసి మెగా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. చరణ్ అన్న స్టైల్ వేరే లెవెల్ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన
కాగా స్టార్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి నటించారు. అలాగే విలక్షణ నటుడు ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇది కూడా చూడండి: బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి
రెండు గెటాప్స్
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ (game changer budget) తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో చరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. అందులో ఒకటి రాజకీయ యువకుడిగానూ, మరోక పాత్ర ప్రభుత్వ అధికారిగానూ దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఇలా ప్రతీ అప్డేట్ సినీ ప్రియులు, అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.
ఇది కూడా చదవండి: 5 నుంచి రైతు భరోసా అప్లికేషన్లు.. సర్కార్ సంచలన నిర్ణయం!
ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. మొత్తంగా ఈ మూవీ రిలీజ్ కోసం సినీ ప్రియులు తహతహలాడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది.. ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.