Rythu Bharosa: 5 నుంచి రైతు భరోసా అప్లికేషన్లు.. సర్కార్ సంచలన నిర్ణయం!

రైతు భరోసా స్కీమ్ విధివిధానాలపై ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. స్కీమ్ అమలుకు రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంకా ట్యాక్స్ చెల్లించే వారికి కూడా సాయం ఇవ్వాలని భావించినట్లు సమాచారం.

New Update
Rythu Bandhu: రైతు బంధు కింద రైతుల అకౌంట్లోకి రూ. 1. మీకు ఎంత వచ్చిందో చెక్  చేసుకోండి..!!

రైతు భరోసాపై విధివిధానాల అమలుపై తెలంగాణ కేబినెట్ సబ్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కు సంబంధించి అప్లికేషన్లను తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు అప్లికేషన్లను తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ భావించినట్లు సమాచారం. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో చర్చింది దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అనంతరం జనవరి 14 నుంచి రైతు భరోసాను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: ED: కేటీఆర్ కారు రేస్ కేసులో బిగ్ ట్విస్ట్..ఏసీబీకి BLNరెడ్డి కీలక లేఖ

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో రైతు బంధు సాయాన్ని కొండలు, గుట్టలకు, వెంచర్లకు కూడా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు అనేక సార్లు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రూల్స్ మారుస్తామని.. అర్హులకు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు భరోసా సాయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రూల్స్ ఎలా ఉంటాయి? ఎలాంటి మార్పులు ఉంటాయి? అన్న అంశంపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆదాయ పన్ను చెల్లించే వారికి ఉండదన్న చర్చ కూడా సాగింది. ఈ ఊహానాలకు ఎల్లుండి తెరపడనుంది. ఆదాయ పన్ను చెల్లింపు, భూ పరిమితిని ఉంచొద్దని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయ పడినట్లు సమాచారం. 
ఇది కూడా చదవండి: AP Cabinet: వచ్చే ఏడాది నుంచే తల్లికి వందనం.. ఇంక ఆ స్కీమ్స్ కూడా

అప్లికేషన్లతో గందరగోళం..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తులు తీసుకోకుండానే రైతుబంధు సాయాన్ని ఇచ్చింది. అప్లికేషన్లు తీసుకుంటే రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆ సమయంలో ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అప్లికేషన్లు తీసుకోవాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇది రైతులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు