/rtv/media/media_files/2025/10/10/lokah-2025-10-10-07-17-24.jpg)
Lokah
Kotha Lokah OTT: మలయాళ సినిమాల్లో సూపర్ హీరో తరహాలో వచ్చిన విభిన్న చిత్రాల్లో ‘లోక: ఛాప్టర్ 1 - చంద్ర’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కల్యాణీ ప్రియదర్శన్ సూపర్‌హీరోగా నటించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకుడు, రచయిత కూడా.
Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మళయాళ సినిమా!
గత కొన్ని సంవత్సరాల్లో మళయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్ద హిట్‌ల్లో ‘లోక’ ముందుంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ రూ. 300 కోట్లు గ్రాస్ కలెక్షన్ అందుకున్న తొలి మళయాళ మూవీగా నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం త్వరలో 50 రోజుల వేడుక జరుపుకోనుంది.
Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!
ఓటీటీ రిలీజ్ కోసం అభిమానుల తహతహ
థియేటర్లలో విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, అక్టోబర్ 17, 2025 న జియో హాట్‌స్టార్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌కి రానుందని టాక్ వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. మేకర్స్ కూడా ఇప్పటివరకు ఈ విషయం మీద స్పందించలేదు. అయినా కూడా, ఈ తేదీ చుట్టూ భారీ అంచనాలు ఉన్నాయి. రోజూ ఈ అప్‌డేట్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో “LOKAH OTT DATE” అని ట్రెండ్ చేస్తున్నారు.
Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్
ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించగా, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి, సాండీ మాస్టర్, నెస్లన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. కథలో వచ్చే ట్విస్ట్‌లు, విజువల్స్, ఎమోషనల్ లెవల్స్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
‘లోక’ సినిమాకు సంగీతాన్ని అందించిన జేక్స్ బెజాయ్ మ్యూజిక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ స్వంత బ్యానర్ అయిన వే ఫారెర్ ఫిలింస్ నిర్మించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇంత పెద్ద స్థాయిలో హిట్ కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
థియేటర్‌లలో హిట్ టాక్ సంపాదించుకున్న ‘లోక’ త్వరలో ఓటీటీలో కూడా సందడి చేయనుంది. అక్టోబర్ 17న స్ట్రీమింగ్ ఉంటుందన్న వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ఈ మూవీ ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది!