Coolie Hindi Version: ఓటీటీలో ‘కూలీ’ హిందీ వెర్షన్.. ఈ వీకెండ్‌కి మిస్ అవ్వొద్దు!

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో హిందీ వర్షన్‌ స్ట్రీమింగ్ అవుతోంది. గత నెలలో సౌత్ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తోనే భారీ వసూళ్లు సాధించింది. ఈ మాస్ ఎంటర్టైనర్‌కి అనిరుధ్ సంగీతం అందించాడు.

New Update
Coolie Hindi Vesion

Coolie Hindi Version

Coolie Hindi Version: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన భారీ యాక్షన్ సినిమా ‘కూలీ’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గత నెలలో ఈ చిత్రం దక్షిణాది భాషల్లో ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా హిందీ డబ్ వెర్షన్ ‘Coolie: The Powerhouse’ పేరుతో ఇప్పుడు ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ వెర్షన్ థియేటర్లలో విడుదలై 8 వారాలు పూర్తయ్యింది.

Also Read: 'బాహుబలి' బడ్జెట్‌ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ

ఈ సినిమాతో రజనీ మళ్లీ మాస్ అవతార్ లో సందడి చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రాజెక్ట్‌పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే హవా చూపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే, కథ విషయంలో మాత్రం ప్రేక్షకుల్లో కొంత మిక్స్డ్ టాక్ రావడం విశేషం. కొంతమంది దీన్ని బోరింగ్‌గా ఫీల్ అవ్వగా, మరికొంతమంది మాత్రం రజనీకాంత్ మాస్ మేనరిజం‌కి ఫిదా అయ్యారు.

Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!

కథ సంగతికి వస్తే..

సినిమా నేపథ్యం వైజాగ్ పోర్ట్. అక్కడ సైమన్‌ అనే డాన్ (నాగార్జున) తన "కింగ్‌పిన్ లాజిస్టిక్స్" సంస్థతో అక్రమ వ్యాపారాలు చేస్తూ గ్యాంగ్‌ని నడుపుతుంటాడు. ఈ గ్యాంగ్‌లోని కీలక వ్యక్తి దయాల్ (సౌబిన్ షాహిర్). అయితే ఈ దయాల్ అక్కడ పని చేసే రాజశేఖర్ (సత్యరాజ్) అనుకోని పరిస్థితుల్లో చంపేస్తాడు. అతని స్నేహితుడు దేవా (రజనీకాంత్) 30 ఏళ్ల తర్వాత వైజాగ్‌కు వస్తాడు. ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? అన్నదే కథలో సస్పెన్స్‌. సినిమాలో ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, రచితా రామ్, పాత్రలు కూడా కథకు బలంగా నిలుస్తాయి.

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అధినేత కలానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా, సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ తన ఎనర్జిటిక్ ట్యూన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాకి టెక్నికల్ గానూ మంచి మార్కులు వచ్చాయి.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

ఇప్పుడు ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ వర్షన్‌లో అందుబాటులో ఉండడం ఓ పెద్ద అప్‌డేట్. థియేటర్‌లో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ మాస్ యాక్షన్ డ్రామా చూసే అవకాశం ఉంది. ఈ వీకెండ్ స్పెషల్.. రజనీకాంత్‌తో 'కూలీ' మిస్ అవ్వొద్దు!

Advertisment
తాజా కథనాలు