S S Rajamouli: హీరోలను వదలని రాజమౌళి శాపం.. 'గేమ్ ఛేంజర్' తో మరోసారి ప్రూవ్

రాజమౌళితో సినిమా చేసిన హీరోల తర్వాతి సినిమాలు ప్లాపే అని మరోసారి రుజువైంది. 'RRR' తర్వాత రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' నిన్న రిలీజై ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రాజమౌళి శాపం నుంచి చెర్రీ కూడా తప్పించుకోలేక పోయాడని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

New Update
rajamouli ram charan

rajamouli ram charan

దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ హీరోకి ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్టే. అతనితో పనిచేసిన హీరోల రేంజ్‌ కూడా ఊహించని స్థాయికి చేరుతుంది. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ వంటి హీరోల కెరీర్‌ రాజమౌళి సినిమాలతోనే  మారింది. మగధీరతో రామ్ చరణ్, బాహుబలితో ప్రభాస్ ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారో అందరికీ తెలిసిందే. 

టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ ఫ్లాప్‌ను అస్సలు చూడని దర్శకుడిగా రాజమౌళికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే అతనితో సినిమా చేసిన హీరోల తర్వాతి సినిమాలు మాత్రం ప్లాపే అనే బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. 'మగధీర' లాంటి ఇండస్ట్రీ హిట్  తర్వాత రామ్ చరణ్ 'ఆరెంజ్' తో ప్లాప్ అందుకున్నాడు. 'విక్రమార్కుడు' తర్వాత రవితేజ ఖాతాలో 'ఖతర్నాక్' తో డిజాస్టర్ పడింది. 

స్టూడెంట్ నంబర్ 1 తర్వాత సుబ్బుతో, 'సింహాద్రి' తర్వాత ఆంద్రావాలా' తో 'యమదొంగ' తర్వాత 'కంత్రి' తో ఏకంగా మూడు సార్లు ప్లాప్స్ రుచి చూశాడు. పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్‌ను నిలబెట్టిన 'బాహుబలి' తర్వాత డార్లింగ్ నుంచి వచ్చిన 'సాహో' బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయింది. ఇక ఇటీవల ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో 'RRR' అనే మల్టీస్టారర్ ను తెరకెక్కించాడు రాజమౌలి. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి 'దేవర' మూవీ వచ్చింది. 

ఈ సినిమాకు ఫస్ట్ ప్లాప్ టాక్ వచ్చింది. ఆ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఒక విధంగా 'దేవర'తోనూ తారక్ కు రాజమౌళి శాపం వదల్లేదు. ఇక ఇప్పుడు మరోసారి రాజమౌళి బ్యాడ్ సెంటిమెట్ రిపీట్ అయింది. 'RRR' తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' జనవరి 10 న విడుదలయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ప్లాప్ టాక్ వచ్చింది. 

సినిమా అంతా పాత చింతకాయ పచ్చడిలాగే ఉందని, శంకర్ అవుట్ డేటెడ్ స్టోరీతో విసుగు పుట్టించాడని.. సినిమాకు అంతా నిగిటివ్ టాకే వచ్చింది. దీన్ని బట్టి రామ్ చరణ్ కూడా రాజమౌళి శాపం నుంచి తప్పించుకోలేక పోయాడని నెటిజన్స్ అంతా సోషల్ మీడియాలో దీన్నే హైలైట్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు