SSMB29 - Globe Trotter: పండగ వేళ మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్.. SSMB29 ఫస్ట్ లుక్ వచ్చేసింది!

మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి. నవంబర్ లో SSMB29 అప్డేట్ ఇస్తామంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

New Update
SSMB 29

SSMB 29

SSMB29 - Globe Trotter: రాజమౌళి(SS Rajamouli)- మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 పై రోరోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్  ఎప్పుడెప్పుడా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నేడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి. నవంబర్ లో మూవీ అప్డేట్(SSMB 29 First look Poster) ఇస్తామంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. మహేశ్‌ను గ్లోబ్‌ట్రోటర్‌గా అభివర్ణిస్తూ మూవీలోని అతడి లుక్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ మెడ భాగం మాత్రమే కనిపిస్తోంది. మెడలో రుద్రాక్ష, చుట్టూ రక్తపు మరకలతో లుక్ ఆసక్తిని పెంచుతోంది. రాజమౌళి అప్డేట్(SSMB29 Movie Updates) తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. సినిమా కోసం వెయిటింగ్ అంటూ అభిమానుల కామెంట్లు పెడుతున్నారు. 

అడ్వెంచర్ డ్రామా

భారీ అడ్వెంచర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని 'ఇండియానా జోన్స్' మరియు పౌరాణిక కథల స్ఫూర్తితో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా కథ  ఆఫ్రీకాన్ అడవుల్లో, వివిధ దేశాల్లో సాగుతుంది. ఇందులో మహేష్ బాబు ఒక ఒక గ్లోబ్‌ట్రాటర్ (ప్రపంచమంతా ప్రయాణించే వ్యక్తి)గా కనిపించబోతున్నట్లు ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ తో అర్థమైంది. సుమారు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంతమేర పూర్తయింది. హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ కెన్యా, టాంజానియా లేదా దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు డూప్ లేకుండా సొంతగా స్టెంట్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు షూటింగ్ నుంచి మహేష్ బాబు కి సంబంధించిన పలు యాక్షన్ సన్నివేశాలు ఆ మధ్య నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.  మొదటిసారిగా మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. RRR, బాహుబలిని మించి ఈ సినిమా ఉండబోతుందని నెటిజన్లు భావిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Raksha Bandhan 2025: సోదరుడికి రాఖీ కడుతున్నారా.. ఒక్క నిమిషం.. ఏ రంగు రాఖీ కడితే మంచిదో తెలుసా?

విజయేంద్ర ప్రసాద్ కథ

హై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు జోడీగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రియాంక కూడా పలు యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టనున్నట్లు  తెలుస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్. మాధవన్ కూడా  కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి నాన్న విజయేంద్ర ప్రసాద్  SSMB29 కథను అందించగా.. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారు. 

Also Read:Mahesh Babu Globe Trotter: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా..!? పండుగాడి దెబ్బకు ఇండస్ట్రీ షేక్..!

    Advertisment
    తాజా కథనాలు