/rtv/media/media_files/2025/04/30/iPMOJ1q3OvHICpH5ujBe.jpg)
mahesh babu ssmb29 new look
SSMB 29 మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'SSMB 29'. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక అప్డేట్ వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మహేష్ బాబు కొత్త లుక్ ఫొటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. పొడవాటి ఉంగరాల జుట్టుతో స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.'షేర్', 'హాలీవుడ్ హీరో' అంటూ తమ హ్యాండిల్స్ లో ఫొటోలు షేర్ చేస్తున్నారు. మహేష్ ఒక రెస్టారెంట్ లాన్ లో భార్య నమ్రత, తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉండడం ఈ ఫొటోల్లో కనిపించింది.
Mahesh babu new look goes viral 🔥#ssmb29#maheshbabu#mahesh#superstar#rajamouli#SSRajamouli#SamanthaRuthPrabhu#priyankachoprapic.twitter.com/Kz1LV74e4f
— Navi (@navisrinik) April 30, 2025
గత చాలా సినిమాల్లో ఒకేలాంటి లుక్ తో మెయింటైన్ చేసే మహేష్ బాబు, 'SSMB 29' కోసం తన జుట్టును పొడవుగా పెంచాడు. జక్కన్న క్రియేటివ్ యూనివర్స్ లో రూపొందుతున్న ఈ మెగా-స్పెక్టేకల్ హాలీవుడ్ సినిమా రేంజ్ దృశ్యాలను తలపించబోతున్నట్లు తెలుస్తోంది.
లీక్స్..
ఇదిలా ఉంటే.. సినిమాకు సంబంధించిన మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. లీక్స్ మాత్రం అవుతూనే ఉన్నాయి. ఇటీవలే ఒడిశా షెడ్యూల్ నుంచి లీకైన మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో జక్కన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. సెట్స్‌లో మొబైల్ ఫోన్‌ల వాడకంపై కఠినమైన నియమాలను అమలు చేశారు. ప్రధాన నటులు మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు.
cinema-news | latest-news | SSMB29 movie
Also Read: Kishkindhapuri వణుకుపుట్టిస్తున్న 'కిష్కింధాపురి' గ్లింప్స్ వీడియో! ఇక్కడ చూడండి