/rtv/media/media_files/2025/11/18/rajamouli-pressmeet-2025-11-18-07-42-44.jpg)
Rajamouli Pressmeet
Rajamouli Pressmeet: దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎప్పుడూ తన సినిమాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయన రూపొందిస్తున్న భారీ చిత్రం వారణాసి గ్లింప్స్(Varanasi Title Teaser) విడుదలతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా, ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా, పృథ్విరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) విలన్‌గా నటిస్తున్నారు.
Also Read: ఓటీటీలో దుమ్ము లేపుతున్న డ్యూడ్.. త్వరలో మరో సర్‌ప్రైజ్!
ఆశ్చర్యకరంగా, ఈసారి రాజమౌళి తన కెరీర్‌లో మొదటిసారి షూటింగ్ పూర్తికానిక ముందే అంతర్జాతీయ మీడియాతో మాట్లాడటం ప్రత్యేకంగా మారింది. సాధారణంగా ఆయన సినిమాల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతారు. కానీ ఈసారి తొందరగా గ్లింప్స్ విడుదల చేసి, విదేశీ మీడియాతో కూడా సంభాషించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read: ఐబొమ్మ రవి టాలెంట్ సూపర్.. అతడ్ని వాడుకోండయ్యా - శివాజీ ప్రశంసలు..!
అంతర్జాతీయ స్థాయిలో వారణాసి
గ్లింప్స్ విడుదలైన తర్వాత రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలతో మాట్లాడారు. నిన్న హైదరాబాద్‌లో ఈ టీం కొంతమంది విదేశీ జర్నలిస్టులను కలిసింది. వారు గ్లింప్స్ ప్రత్యేకంగా చూడడానికి భారత్‌కు వచ్చారు. ఈ స్టెప్ ద్వారా వరాణాసి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ప్రమోట్ చేయగలిగారు. రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకు పెద్ద పాజిటివ్ హైప్ తీసుకొచ్చింది.
ఇప్పటికే గ్లింప్స్ ఇంటర్నెట్‌లో భారీ స్పందన పొందింది. ప్రపంచం నలుమూలల నుంచి రాజమౌళి చూపిన విజువల్స్, స్కేల్, VFX వినియోగం గురించి మంచి ప్రశంసలు వస్తున్నాయి. చిత్రంలోని వాతావరణం, ప్రపంచాన్ని చూపించిన తీరు ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచింది.
Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ బిగ్ అప్‌డేట్.. మాస్ సాంగ్ లోడింగ్..!
సినిమా విడుదలకు మార్చ్ 2027ను టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రస్తుతం మూవీ క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. మిగిలిన షూట్ ఎక్కడ జరుగుతుందో త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. శ్రీ దుర్గా ఆర్ట్స్‌కు చెందిన కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారణాసి నుంచి మరిన్ని అప్‌డేట్లు త్వరలో రానున్నాయి. అభిమానులు ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ తో ఎదురు చూస్తున్నారు.
Follow Us