iBomma Ravi: ఐబొమ్మ రవి టాలెంట్ సూపర్.. అతడ్ని వాడుకోండయ్యా - శివాజీ ప్రశంసలు..!

ఇమ్మడి రవి.. ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వినిపిస్తోంది. ‘ibomma’, ‘bappam’ వంటి పైరసీ వెబ్‌సైట్లను క్రియేట్ చేసి కొత్త కొత్త సినిమాలను అందులో అప్లోడ్ చేసి.. తెలుగు సినీ ఇండస్ర్టీకి వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడు.

New Update
actor shivaji Praise to iBomma admin immadi Ravi

actor shivaji Praise to iBomma admin immadi Ravi


ఇమ్మడి రవి.. ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వినిపిస్తోంది. ‘ibomma’, ‘bappam’ వంటి పైరసీ వెబ్‌సైట్లను క్రియేట్ చేసి కొత్త కొత్త సినిమాలను అందులో అప్లోడ్ చేసి.. తెలుగు సినీ ఇండస్ర్టీకి వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. ఇదే విషయంపై పోలీసులకు కూడా గట్టి సవాల్ విసిరాడు. తనను ఎవరూ పట్టుకోలేరని.. అందరి డేటా తన వద్ద ఉందని బెదిరించాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. ఎట్టకేలకు ‘ఐబొమ్మ’ కింగ్ పిన్ ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. 

actor shivaji Praise to immadi Ravi

వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవి అరెస్టుపై తాజాగా సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు చేసిన దుర్మార్గమైన పనికి అరెస్టు చేసినా తప్పులేదని.. కానీ అతడి టాలెంట్ మాత్రం సూపర్ అంటూ ఇమ్మడి రవి స్కిల్‌ను మెచ్చుకున్నారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు శివాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

శివాజీ ఏమన్నారంటే.. ‘‘హ్యాకర్ అబ్బాయిని మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఆ అబ్బాయి చాలా మంచి హ్యాకర్ అని విన్నాను. అతడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. టాలెంట్ ఎవరిసొత్తూ కాదని.. ఆ అబ్బాయి ప్రూవ్ చేశాడు. అతడు చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే.. అతడి టాలెంట్ గురించి వింటుంటే.. అలాంటి వ్యక్తి నిజంగా దేశానికి పనికొస్తాడు కదా అనిపించింది. 

ఎక్కడైనా సెక్యూరిటీ సిస్టమ్‌లో యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. అతడిది తెలిసీ తెలియని వయసు. డబ్బులేని ఒక తనం.. ఇవన్నీ వెంటబడి అతడి మైండ్‌లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చేలా చేశాయి. చాలా మందికి ఇబ్బంది పెట్టాడు. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. ఎవ్వరైనా దానికి లోబడి ఉండాల్సిందే. ఇక నుంచైనా అతడు మారాలని కోరుకుంటున్నాను.’’ అంటూ చెప్పుకొచ్చారు. అతడి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. 

శివాజీని ట్రోల్స్ చేసేవాళ్లందరూ ఒక్కసారి ఆలోచించండి. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. రవి 100% తప్పు చేశాడు. శివాజి అన్నట్టు రవి బ్రిలియంట్. సైబర్ నేరాల అడ్డకట్టుకు తగిన వ్యక్తి. సక్రమదారిలో పడితే మంచిది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు