/rtv/media/media_files/xS9CsrknfTrVqTJ8gO4D.jpg)
Devara Success Meet : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజ్ రోజు మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా మెల్ల మెల్లగా పాజిటివ్ టాక్ తో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది.
మొదటి రోజే రూ.172 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్ప్పటి దాకా రూ.405 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఓ భారీ సక్సెస్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ అందుకు అనుమతి లభించకపోవడంతో ఓ హోటల్‌లో ఈ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు.
Also Read : 'రాజా సాబ్' లో ప్రభాస్ అలాంటి రోల్ లో కనిపిస్తారు : మాళవిక మోహనన్
ఈ పార్టీకి మూవీ టీమ్ తో పాటూ పాన్ ఇండియా డైరెక్టర్స్ అయిన దర్శక ధీరుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు అయ్యారు. పార్టీలో ఈ ఇద్దరు డైరెక్టర్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీళ్ళు 'దేవర' సక్సెస్ పార్టీలో సందడి చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ డైరెక్టర్స్ తో పాటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం ఈ సక్సెస్ పార్టీలో సందడి చేయడం విశేషం.
Jakkanna @ssrajamouli 🤩🤩 at #Devara success party 🎉 @tarak9999 #JrNTR #BlockbusterDevara pic.twitter.com/doF096LqlI
— Sailesh ♥ (@shivanirvana001) October 3, 2024
Prashanth Neel at Devara Sucess party🎉🎉🎉💥💥💥 @tarak9999#DevaraBlockbuster @DevaraMovie @vamsi84 fans ki leda success meet...lepisara sir.... pic.twitter.com/KTroKouU1s
— Swamy@Tarakian (@Narayan81209765) October 4, 2024
'బృందావనం'తో మొదలు..
ఈ సక్సెస్ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బృందావనం మూవీతో తమ ప్రయాణం మొదలైందని, ఇప్పుడాయన తమ కుటుంబ సభ్యుడిగా మారారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను 'దేవర 2' చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.