పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ‘ది రాజా సాబ్’. భారీ అంచనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బ్యూటీఫుల్ లవ్ అండ్ హారర్ జానర్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ లుక్ వేరే లెవెల్ ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది.
Also Read: హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్.. పదోతరగతి ఉంటే చాలు!
ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు క్లాసిక్ సినిమాతో వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దీంతో ఈ మూవీ అప్డేట్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు సరికొత్త సర్‌ప్రైజ్ అందించే అప్డేట్ వచ్చింది.
Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్
రాజా సాబ్ టీజర్ రెడీ
రాజా సాబ్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయాలని డైరెక్టర్ మారుతీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాని పైనే మారుతి ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా దీని కోసం మారుతి తీవ్రంగా కష్టపడుతున్నాడని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.
Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!
ఇక ఈ టీజర్‌తో ‘రాజా సాబ్’ అంచనాలు మరింత పెరగడం ఖాయమని సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు ఇందులో ప్రభాస్ సరసన నటిస్తున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ప్రభాస్‌ను ఢీ కొట్టే పాత్రలో నటిస్తున్నాడు. దీంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది.
Also Read: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్..
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.