Raj Tarun - Lavanya: రాజ్ తరుణ్-లావణ్య ఇష్యూ.. ఇవాళే కోకాపేటలో ఇళ్లు స్వాధీనం!

రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇన్నాళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కోకోపేటలోని ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి ఇవాళ కొనుగోలు దారులు అక్కడకి వెళ్తున్నరనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.

New Update
raj tarun and lavanya shock

raj tarun and lavanya

హీరో రాజ్ తరుణ్ - లావణ్యల ఎపిసోడ్ గత ఏడాది నుంచి ఎంతటి హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి.. తనను అన్ని విధాలుగా వాడుకుని వదిలేసి వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడంటూ లావణ్య మొదట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి మొదలైన వీరి తతంగం.. ఇప్పటికీ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. 

ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయ తింటే డేంజర్.. ఈ విషయాలు మీకు తెలుసా?

అమ్మేసిన ఇళ్లు

ఇటీవలే కోకాపేటలోని పుప్పాలగూడలో రాజ్ తరుణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు.. లావణ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాజ్ తరుణ్ ఇంట్లో  నివాసం ఉంటున్న లావణ్య.. ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని అతడి తల్లిదండ్రులు ఏప్రిల్ 16న ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఇరువురి మధ్య మాటల యుద్దం జరిగింది. కానీ ఆ ఇంటిని రాజ్ తరుణ్ జనవరిలోనే అమ్మేశాడు. ఆ విషయం తెలిసే లావణ్య ఆ ఇంటిని ఖాళీ చేయకుండా అక్కడే ఉంటుంది. ఇది కూడా చదవండి: రసాయనాలతో పండించిన మామిడిని ఎలా గుర్తించాలి?

ఇవాళే ఇళ్లు స్వాధీనం?

ఈ క్రమంలోనే ఇప్పుుడు ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి కొనుగోలు దారులు అక్కడకి వెళ్తున్నారనే వార్త నెట్టింట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏప్రిల్ 16న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, లావణ్య మధ్య జరిగిన గొడవ తర్వాత ఆ ఇల్లును స్వాధీనం చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. ఇందులో భాగంగానే ఇవాళ (మే2) ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి. 

Raj Tarun | hero raj tarun | raj tarun lavanya | raj tarun house | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు