/rtv/media/media_files/2025/04/15/DRssDtlvaull82gsMtrp.jpg)
Radhika Apte
Radhika Apte: విలక్షణ పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే, దక్షిణాదిన కూడా కొన్ని గుర్తుండిపోయే సినిమాలు చేసింది. 'ధోని', 'కబాలి' వంటి చిత్రాలతో తమిళంలో, ‘లయన్’, ‘లెజెండ్’ సినిమాలతో తెలుగులో కనిపించిన ఆమె, ‘లెజెండ్’ తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి దూరమైంది.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
ఇంతకాలం తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్న రాధికా, ఓ ఇంటర్వ్యూలో చెప్పిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా సౌత్ సినిమాల్లో నటించడం మానేశారనే వార్తలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. దాంతో, ఆమెకు అవకాశాలే రాలేదో, లేక ఆమే దూరంగా ఉంటున్నారో అనే చర్చలు కూడా నడిచాయి.
విజయ్ సేతుపతి హీరోగా
అయితే ఇప్పుడు తాజాగా, రాధికా మళ్లీ తెలుగులో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్లో నటించబోతున్నారనే వార్తలు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నారు. ఇప్పటికే సీనియర్ నటి టబు ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారు. అయితే ఆమె పాత్ర సేతుపతికి జోడిగా కాకుండా, ప్రత్యేకమైన క్యారెక్టర్ గా ఉండబోతుందని సమాచారం. సేతుపతికి జోడీగా మాత్రం రాధికా ఆప్టేని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
Also Read: ‘కేజీఎఫ్ చాప్టర్-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!
అయితే విజయ్ సేతుపతి, టబు, రాధికా ఒకే చిత్రంలో కనిపించబోతుండటంతో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కాస్టింగ్ అనౌన్స్ చేసి పూరి ముందుగానే ఆసక్తిని రేకెత్తించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక స్క్రిప్ట్, టేకింగ్ పరంగా కూడా పూరి తన మార్క్ చూపించగలిగితే, ఈ ప్రాజెక్ట్ ఆయనను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుంది.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..
ఈ సినిమా జూన్‌లో సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పూరి, సేతుపతి, రాధికా కాంబినేషన్ కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..