Pushpa 2 : ఏపీలో 'పుష్ప 2' టికెట్ రేట్ల పెంపు.. పవన్ ఓకే అంటాడా? తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప 2’ టికెట్ రేట్లను భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దీనిపై సముఖంగా ఉండగా ఏపీలో మాత్రం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం బన్నీకి మెగా ఫ్యామిలీతో ఉన్న విబేధాలేనట.పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 21 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప 2 మూవీ మేనియా నడుస్తోంది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కన్నా తెలంగాణలోనే టికెట్ రేట్లు అత్యధికంగా పెరగనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలున్నాయి. కాబట్టి తెలంగాణలో రేవంత్ సర్కార్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఈజీగా పర్మిషన్ ఇస్తారు. కానీ ఏపీలో మాత్రం కాస్త కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఇది కూడా చదవండి: కాగ్ అధిపతిగా తెలుగు అధికారి.. సంజయ్‌మూర్తి అరుదైన ఘనత! #Pushpa2 Ticket Prices TELANGANA : Multiplexes : 2D - Rs : 610/- 3D - Rs : 710/-Single Screens : 2D - Rs : 325/-3D - Rs : 375/-AP : Single Screens : RS : 300/-MULTIPLEX : TO BE DECIDE#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/sWXMZGPtKP — Censor Reports (@censorReport_) November 18, 2024 ఇది కూడా చదవండి: అటవీశాఖలో విలువైన కార్లు మాయం.. నివేదిక కోరిన పవన్! అంతా పవన్ చేతుల్లోనే.. అందుకు కారణం అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీతో ఉన్న విబేధాలే అని అంటున్నారు. ఇటీవల ఏపీ ఎలక్షన్స్ లో బన్నీ.. పవన్ ను కాదని వైసీపీ నేత శిల్పా రవికి సపోర్ట్ చేయడంతో అల్లు అర్జున్ కు ఇది కాస్త మరో మైనస్ గా మారింది. ఎందుకంటే ఏపీలో టికెట్ రేట్లు పెంచాలంటే అది పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది. దానికి తోడు జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిష్టర్ గా ఉండటం, మెగా ఫ్యామిలీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో అల్లు అర్జున్ 'పుష్ప2' సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఏపీలో 'పుష్ప 2' కు భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: Adani: అదానీకి ఊహించని షాక్.. రూ.16 కోట్ల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష! ఇది కూడా చదవండి: Lagacharla: మహబూబాబాద్‌లో హైటెన్షన్.. ఎస్పీ క్యాంపుపై దాడి! #movie ticket prices #allu-arjun #pawan-kalyan #pushpa-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి