/rtv/media/media_files/GQwfudqI4hLb3sOgiD4p.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక బన్నీ ఫ్యాన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. డిసెంబర్ 6 న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. షూటింగ్ కూడా చివరి దశలోనే ఉంది. రెండు రోజుల క్రితమే ఫస్టాఫ్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిందని మూవీ టీమ్ తెలిపింది.
మళ్ళీ మారింది..
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారినట్టు ఓ న్యూస్ బయటికొచ్చింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 నే సినిమా రావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబరు 6కి ప్లాన్ మార్చారు. ఇప్పుడు ఒక్కరోజు ముందుకి అంటే డిసెంబర్ 5 కు రిలీజ్ డేట్ జరిపినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఓవర్సీస్ లో అల్లు అర్జున్ కు భారీ మార్కెట్ ఉంది.
Release update :- PUSHPA 2
— Hari K (@brahmi_fan) October 10, 2024
The film preponed to 5th December i.e. one day before of its previous date... Which marks Thursday release...
Is this the correct decision from team ?? Mostly there will be no midnight shows too... #AlluArjun #Pushpa2 #Puspha2TheRule pic.twitter.com/yWAWHaIIDd
Also Read : 'రానా.. మై బ్రదర్'.. సమంత మాటలకు రానా కళ్ళల్లో నీళ్లు .. వీడియో వైరల్
దాన్ని దృష్టిలో పెట్టుకునే మేకర్స్ రిలీజ్ డేట్ ను ఒకరోజు ముందు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ ఒక్క రోజు ముందుకు జరగడం బన్నీ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగించే విషయమే. డిసెంబర్ 5 న ఇండియాలో రిలీజ్ అయితే, ఓవర్సీస్ లో ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్ 4 నే ప్రీమియర్స్ పడతాయి. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.