'రానా.. మై బ్రదర్'.. సమంత మాటలకు రానా కళ్ళల్లో నీళ్లు .. వీడియో వైరల్

స్టార్ హీరోయిన్ సమంత.. అలియా భట్ 'జిగ్రా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. "రానా.. మై బ్రదర్'' ప్రతీ అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలని చెప్పింది. దీంతో రానా కాస్త ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.

New Update
rana 00

rana

Samantha: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జిగ్రా' ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, రానా దగ్గుబాటి, డైరెక్టర్ త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

రానా మై బ్రదర్ 

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత.. రానా గురించి  చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  రానా.. మై.. బ్రదర్,  రానా ఇటీవలే '35- ఓ చిన్న కథ కాదు'  అంటూ ఓ మంచి  ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఇచ్చారు. ఇప్పడు మళ్ళీ  నెల కాకముందే మరో ఫీమెల్ సెంట్రిక్ సినిమా (జిగ్రా) ను తెలుగులో ప్రజెంట్ చేయడానికి ముందుకొచ్చారు.  రానా లాంటి బ్రదర్ ప్రతీ అమ్మాయికి  ఉండాలేమో అని చెప్పింది. దీంతో రానా కూడా కాస్త ఎమోషనల్ గా ఫీల్ అయినట్లు కనిపించారు. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంతకు దగ్గుబాటి కుటుంబంతోనూ మంచి బంధం ఏర్పడింది. వరుసకు రానా తనకు అన్నయ్య అవుతారు. 

 

 

Also Read: సస్పెన్స్, థ్రిల్, ఫన్.. 'భూల్ భూలైయా 3' ట్రైలర్‌ అదిరిపోయింది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు