pushpa 2 : 'పుష్ప2' ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ గా రాజమౌళి.. ఆ సెంటిమెట్ రిపీట్ అవుతుందా?

'పుష్ప' ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ గెస్ట్లుగా హాజరయ్యారు. పుష్ప-2 కోసం రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. దీంతో ఈసారి కూడా పాన్ ఇండియా సక్సెస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేసున్నారు.

New Update
rajamouli

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటూ ఇతర రాష్ట్రాల్లోనూ 'పుష్ప' ఫీవర్ నడుస్తోంది. ఈ ఏడాది మారె స్టార్ హీరో సినిమాకు లేనంత హైప్ 'పుష్ప2' మూవీకి ఉంది. ఈ హైప్ ను మరింత పెంచేందుకు మూవీ టీమ్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సౌత్, నార్త్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ గట్టిగానే చేసిన మేకర్స్.. నేడు హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ఈవెంట్ ను నిర్వహించారు. 

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. ఆయనతో పాటూ బచ్చిబాబు, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ లాంటి యంగ్ డైరెక్టర్లు సైతం ఈ ఈవెంట్ కు వచ్చారు. అటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా అటెండ్ అయ్యారు. 

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

సెంటిమెంట్ రిపీట్..

ఇదిలా ఉంటే పుష్ప పార్ట్-1 ప్రీ రిలీజ్ కి రాజమౌళి గగెస్ట్ గా వచ్చినప్పుడు.. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ సాధిస్తాడని, అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని అన్నారు. అప్పుడు ఆయన చెప్పినట్లే పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అవ్వడంతో పాటూ అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు పుష్ప 2 ప్రీ రిలీజ్ కి సైతం రాజమౌళి గెస్ట్ గా రావడంతో ఈ సినిమా కూడా అంతకు మించి సక్సెస్ అవుతుందని, రాజమౌళి సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్స్..మెగా హీరో షార్ట్ ఫిలింకి అరుదైన పురస్కారం

Advertisment
Advertisment
తాజా కథనాలు