Puri Sethupathi: హైపెక్కిస్తున్న పూరి - సేతుపతి కాంబో.. మూవీ టైటిల్ ఏంటో తెలిస్తే..!

పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా టైటిల్, టీజర్‌ను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. వరుస ప్లాప్స్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌తో పూరి మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నారు. సమ్యుక్తా, టబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

New Update
Puri Jagannadh- vijay sethupathi

Puri Jagannadh- vijay sethupathi

Puri Sethupathi:

పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న పూరి - సేతుపతి కాంబినేషన్ సినిమా పై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. స్టైలిష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తాజాగా విజయ్ సేతుపతితో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ ఒక ఆసక్తికర అప్డేట్‌ను విడుదల చేశారు.

ఈ సినిమా టైటిల్, టీజర్‌ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 28, 2025 న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా విడుదలైంది. ఈ పోస్టర్ చూసిన తర్వాత, అభిమానులు టైటిల్‌పై ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు.

Also Read :  ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే

ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సమ్యుక్తా, టబు, విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జెబీ మోషన్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

పూరి జగన్నాథ్ గత కొన్ని సంవత్సరాలుగా వరుస ప్లాప్ లతో బాధపడుతున్నారు. లైగర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ చిత్రం ఫుల్ పాన్ ఇండియా ప్రమోషన్‌లతో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది.

తర్వాత ఆయన తన హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తీసి, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ని విలన్‌గా తీసుకుని భారీగా తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. పూరి మార్క్ డైలాగులు, స్టైల్ కంటే క్రింజ్ ఎక్కువ ఉందంటూ ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు.

Also Read: సుజీత్ డ్రీమ్.. SCUతో పవన్, ప్రభాస్ కలిసేనా?

అయితే, ఇలా వరుస పరాజయాల తర్వాత పూరి జగన్నాథ్ ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ సేతుపతితో సినిమా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇది ఆయన కెరీర్‌కు మళ్లీ హిట్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు టెంటేటివ్ టైటిల్ పూరి - సేతుపతిగా ఉంది. సెప్టెంబర్ 28న టైటిల్, టీజర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఈ సినిమా మీద క్రేజ్ మరింత పెరిగింది.

Advertisment
తాజా కథనాలు