OG x Saaho: సుజీత్ డ్రీమ్.. SCUతో పవన్, ప్రభాస్ కలిసేనా?

OG సక్సెస్ తో దర్శకుడు సుజీత్, OG, సాహో సినిమాలకు మధ్య ఉన్న లింక్‌ను వెల్లడించారు. ఆయన తన సొంత సినిమాటిక్ యూనివర్స్ (SCU) ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు పవన్, ప్రభాస్‌ను కలిపే మూవీపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇది భవిష్యత్తులో నిజం కావచ్చు.

New Update
SAAHO - OG

SAAHO - OG

OG x Saaho: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన(Pawan Kalyan) 'OG' సినిమా ప్రీమియర్ షోలు మొదలైన నాటి నుంచి థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సినిమాకు ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షోల ద్వారా ఈ చిత్రం 'పుష్ప 2' ను దాటి రికార్డు క్రియేట్ చేసింది.

ఇక ఈ విజయంతో దర్శకుడు సుజీత్ తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అతను తాను సృష్టించాలనుకుంటున్న ఓ ప్రత్యేక సినిమాటిక్ యూనివర్స్ SCU (Sujeeth Cinematic Universe) గురించి మాట్లాడుతూ, OG కు ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రంతో లింక్ ఉందని తెలిపాడు.

OG - సాహో లింక్ ఉందా?

సుజీత్ మాట్లాడుతూ "ప్రభాస్ అన్న, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. ఇద్దరి మధ్య ఉన్న గౌరవాన్ని బట్టి OG & Saaho మధ్య ఓ చిన్న కనెక్షన్ ప్లాన్ చేశాను. కానీ ఇది పూర్తిగా రెడీ అయిన యూనివర్స్ కాదు. ఇంకా కొంచెం టైమ్ తీసుకుని పక్కా ప్లాన్ చేయాలి," అని చెప్పారు.

అలాగే, పవన్ గారు ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ యూనివర్స్ ఎలా ముందుకు తీసుకెళ్తామన్నది ఇంకా తేలాల్సిన విషయం అని కూడా పేర్కొన్నారు. అంటే, సుజీత్ మాత్రం పవన్ కళ్యాణ్ & ప్రభాస్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సినిమా ఉన్నట్టు హింట్ ఇచ్చారు.

పవన్ మ్యాజిక్‌తో OG.. 

ఇక, పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా మళ్ళీ తన మాస్ స్టామినా చూపించి అభిమానులను ఫుల్ హ్యాపీ చేశాడు. గతంలో వచ్చిన హరిహర వీరమల్లు నిరాశ కలిగించగా, OG మాత్రం అభిమానుల ఆశలు నిలబెట్టింది. థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ కేకలతో హంగామా చేస్తున్నారు. యాక్షన్ సీన్స్, పవన్ స్టైల్, ఫాన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన హై మూమెంట్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

పవన్ - ప్రభాస్ కలసే రోజు వస్తుందా?

సుజీత్ SCU కాన్సెప్ట్ చెప్పిన తర్వాత, అభిమానుల ఊహలు పీక్స్ కి చేరాయి. పవన్ & ప్రభాస్ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే, అది టాలీవుడ్‌లో ఓ అద్భుత ఘట్టం అవుతుంది. ప్రస్తుతం ఇది కేవలం ఆలోచన మాత్రమే అయినా, భవిష్యత్తులో ఇది నిజమైతే అభిమానులఆనందానికి అవధులు ఉండవు. OG & Saaho మధ్య కనెక్షన్ ఓ ఆసక్తికర సర్ప్రైజ్ అందించిందనే చెప్పాలి. ఇప్పుడు మిగిలింది ఒకటే ప్రశ్న, పవన్ & ప్రభాస్ కలసే రోజు వస్తుందా? … కాలమే సమాధానం చెబుతుంది!

Advertisment
తాజా కథనాలు