BIGG BOSS 9: రీతూ చౌదరీ ఎలిమినేటెడ్!..🤭4 వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ ట్విస్ట్!

గత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 9 కాస్త డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రతీ వారం ట్విస్టుల మీద ట్విస్టులతో ఆడియన్స్ కి షోపై ఆసక్తిని పెంచుతున్నాడు బిగ్ బాస్.

author-image
By Archana
New Update

BIGG BOSS 9: గత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 9 కాస్త డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రతీ వారం ట్విస్టుల మీద ట్విస్టులతో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ప్రతీ ఏడాది కామనర్స్ నుంచి ఒకరు లేదా ఇద్దరికి అవకాశం కల్పించేవారు. కానీ ఈ ఏడాది గత సీజన్లకు పూర్తి భిన్నంగా కామనర్స్ ఎంపికకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికే  అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన 6 మంది కామనర్స్  బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగుపెట్టగా.. ఇప్పుడు మరో కంటెస్టెంట్ రాబోతున్నాడు.

ప్రోమో 

నిన్నటి ఎపిసోడ్ లో  'అగ్నిపరీక్ష' లో పాల్గొన్న నలుగురు కామనర్స్ షాకిబ్, నాగ ప్రశాంత్, శ్వేతా, నిఖిత బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో హాజ్ మేట్స్ అంతా ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. అయితే వీరిలో కేవలం ఒక్కరికి మాత్రమే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.  దీని కోసం బిగ్ బాస్ ఒక ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. వైల్డ్ కార్డు నుంచి మీకు ఇష్టమైన ఇద్దరి కంటెస్టెంట్ల పేర్లను రాసి బ్యాలెట్ బాక్సులో వేయమని హౌజ్ మేట్స్ కి తెలిపారు బిగ్ బాస్. దీంతో హౌజ్ మేట్స్ ఎవరి ఓటు హక్కును వారు వినియోగించుకున్నారు. 

దివ్య నిఖిత ఎంట్రీ 

ఇంటి సభ్యుల ఓటింగ్ వైల్డ్ కార్డు దివ్య నిఖితకు లీస్ట్ ఓటింగ్ వచ్చింది. కానీ, ఊహించని విధంగా లీస్ట్ ఓటింగ్ వచ్చిన ఆమెనే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో హౌజ్ మేట్స్ అంతా కాస్త షాకయ్యారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మీరు దివ్య నిఖిత రాకూడదని ఓట్ వేశారు. కానీ బిగ్ బాస్ లో మీరు ఊహించనిది జరుగుతుంది అని ట్విస్ట్ ఇచ్చాడు. 

రీతూ ఎలిమినేటెడ్.. 

 ఇదిలా ఉంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. రీతూ చౌదరీ, రాము రాథోడ్, ప్రియా శెట్టి, ఫ్లోరా, పవన్ కళ్యాణ్ ఈ వారం నామినేషన్ లో ఉండగా.. నిన్న ఎపిసోడ్ లో ఇమ్యూనిటీ టాస్క్ గెలిచి నామినేషన్ నుంచి సేవ్  అయిపోయింది ఫ్లోరా. దీంతో ఇప్పుడు రీతూ చౌదరీ, రాము రాథోడ్, ప్రియా శెట్టి, పవన్ కళ్యాణ్ మాత్రమే నామినేషన్స్ లో ఉన్నారు. పలు ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం ప్రస్తుతం.. రీతూ చౌదరీ, ప్రియా శెట్టి డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ప్రియా ఎలిమినెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రియా ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి రావడం దీనికి తోడు గత రెండు వారాల్లో ఆమెపై కాస్త నెగెటివిటీ క్రియేట్ అవడం ఎలిమినేషన్ కు ప్రధాన కారణమని ప్రేక్షకులు అంటున్నారు. 

డబుల్ఎలిమినేషన్ 

అయితే ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. రీతూ చౌదరీ కూడా ఎలిమినెట్ అయ్యే ఛాన్స్ ఉందని ఇన్ సైడ్ టాక్. ఈ మధ్య రీతూ ప్రతి చిన్న విషయానికి ఏడుపు మొదలు పెట్టడం.. ఆమె స్టార్ చేయగానే డెమోన్ ఓదార్పు కోసం రావడం చూడ్డానికి ఇరిటేషన్ కలిగిస్తుందని ప్రేక్షకుల అభిప్రాయం. డెమోన్, రీతూ పులిహోర కంటెంట్ కూడా కాస్త ఓవర్ అనే ఫీలింగ్ కలుగుతోంది ప్రేక్షకుల్లో. ఇవే ఈ రీతూ ఎలిమినేషన్ కి ప్రధాన కారణాలని నెటిజన్ల అభిప్రాయం.

Also Read: OG OTT: అప్పుడే  'ఓజీ' ఓటీటీ డీల్ ఫిక్స్.. పండగ కానుకగా స్ట్రీమింగ్!

Advertisment
తాజా కథనాలు