/rtv/media/media_files/2025/09/26/singer-zubeen-garg-death-case-2025-09-26-10-33-40.jpg)
Singer Zubeen Garg death case
Singer Zubeen Garg: అస్సామీ ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ ఓ బోట్ ట్రిప్ లో ప్రమాదవశాత్తు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సెప్టెంబర్ 19న సింగపూర్ లో జరిగిన 20వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన గార్గ్.. అక్కడ తన స్నేహితులతో కలిసి ఓ యాచ్ (బోట్) ట్రిప్ వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి గార్గ్ స్పాట్ లోనే మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. జుబీన్ గార్గ్ హఠాత్మరణం దేశవ్యాప్తంగా ఆయన అభిమానులను, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.\
మ్యుజీషియన్ అరెస్ట్
అయితే జుబీన్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ కేసు విచారణ కోసం అస్సామీ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన SIT జుబీన్ మరణించిన సమయంలో ఆయనతో ఉన్నవారందరినీ విచారిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మ్యూజిషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని అరెస్ట్ చేసింది. శేఖర్ జ్యోతి కూడా ఘటన జరిగిన రోజు అదే బోట్ లో ఉన్నారు. దీంతో గార్గ్ మరణానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవడానికి అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జుబీన్ గార్గ్ మరణం వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.
అస్సామీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సింగర్ మార్గ్. తన సంగీతంతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
అంతిమయాత్రలో రికార్డ్
ఆయన అంతిమయాత్ర అత్యధిక మంది పాల్గొన్న అంతిమయాత్రలో ఒకటిగా నిలిచిందని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది.
మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్ II వంటి ప్రపంచ స్థాయి ప్రముఖుల అంత్యక్రియల తర్వాత అంత అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్న నాల్గవ అంతిమయాత్ర జుబిన్ గార్గ్ ది! ఆయన అంత్యక్రియల సమయంలో గువహతిలోని రోడ్లన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. వేల సంఖ్యల్లో, అభిమానులు, ప్రజలు తరలివచ్చి.. తమ అభిమాన గాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు.
38వేలపాటలు
గాయకుడిగానే కాదు నటుడిగా సంగీత దర్శకుడు, దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు గార్గ్. గ్యాంగ్‌స్టర్" చిత్రంలోని "యా అలీ" పాటతో దేశవ్యాప్తంగా పేరు పొందారు. 40 భాషలలో 38 వేలకు పైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా "కింగ్ ఆఫ్ హమ్మింగ్" అని పిలుచుకుంటారు. ఆయన అకాల మరణం అభిమానులకు తీరని లోటు మిగిల్చింది.