నాగ వంశీకి షాక్.. సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా?

మూవీ టికెట్ల ధరలపై నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నలుగురున్న ఫ్యామిలీ రూ.1500లతో టికెట్ కొనలేరా? అని అన్నాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అవే డబ్బులు పెట్టిచూస్తే సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా? అని ప్రశ్నించాడు.

Producer Naga Vamsi
New Update

టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాతల్లో నాగ వంశీ ఒకరు. ఎన్నో చిత్రాలను నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఓ వైపు చిన్న చిన్న హీరోలత సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు అందుకుంటున్నాడు. మరోవైపు ఎన్టీఆర్, మహేశ్ బాబు అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సైతం సినిమాలు తీసి లాభాలు అందుకుంటున్నాడు. 

ఇటీవలే దేవర మూవీని నిర్మించాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 16 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో నిర్మాతకు బాగా లాభాలు వచ్చాయి. ఇక ఈ మూవీ తర్వాత ప్రొడ్యుసర్ నాగ వంశీ ఇప్పుడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ మూవీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్యూలో నిర్మాత నాగ వంశీ పాల్గొన్నాడు.

Also Read :  కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. 90మందికి అస్వస్థత

ఒక సినిమాకి రూ.1500 పెట్టలేరా?

ఇందులో భాగంగానే దేవర కలెక్షన్స్‌తో పాటు ప్రస్తుత సినిమా టికెట్ల ధరలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే అతడు సినిమా టికెట్లపై మాట్లాడిన మాటలు నెట్టింట చర్చనీయాంశం అయింది. ముందుగా దేవర ఫేక్ కలెక్షన్లపై మాట్లాడాడు. దేవర సినిమా ఎంత మేర కలెక్షన్స్ సాధించిందో అంత మేరకు రిపోర్ట్ చేశానని చెప్పాడు. ఒకవేళ అంత కలెక్షన్స్ వచ్చాయని మీడియా నమ్మకపోతే తన తప్పేంటని అన్నట్లు మాట్లాడాడు.

ఇక దీని తర్వాత టికెట్ రేట్ల విషయం గురించి మాట్లాడాడు. ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి రూ.1500 కూడా పెట్టలేరా? అని మాట్లాడటంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఒక ఫ్యామిలీలో నలుగు సినిమాకి వెళ్లారు. అందులో ఒక్కొక్కరు చొప్పున రూ.250 పెట్టి టికెట్ కొన్నారు. అంటే మొత్తం రూ.1000 అవుతుంది.

Also Read :  లవర్‌తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్.. ట్విస్టులే ట్విస్టులు!

ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా..?

అలాగే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్‌కు కలిపి రూ.500 అవుతుంది. మొత్తం రూ.1500 అవుతుంది. ఇంత తక్కువలో అమౌంట్‌తో మూడు గంటల ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ వస్తుంది. ఆంధ్రలో కానీ, తెలంగాణలో కానీ యూఎస్‌లో కానీ అదే అమౌంట్‌కి మూడు గంటలు ఎంటర్‌టైన్ చేసే ఎలిమెంట్ మరొకటి లేదు’ అని చెప్పుకొచ్చారు. దీంతో చాలా మంది నెటిజన్లు నాగ వంశీ మాటలపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు. ‘‘రూ.1500 తీసుకుని ఫ్లాప్ సినిమాలు తీసినప్పుడు మేము ఎంటర్టైన్ కానప్పుడు టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా..?’’ అని కామెంట్లు చేస్తున్నారు. 

Also Read :  ఏపీలో నేడు మద్యం దుకాణాలు కేటాయింపులు!

Also Read :  బంగాళాఖాతంలో అల్పపీడనం..4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

#tollywood #devara #producer-naga-vamsi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe