Ap: బంగాళాఖాతంలో అల్పపీడనం..4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల ఏపీలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు.

New Update
Telangana : బంగాళాఖాతంలో వాయుగుండం...తెలంగాణ పై ఎంత ప్రభావం అంటే!

Andhra Pradesh: ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ  కేంద్ర అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనం బలపడి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనిస్తుందని తెలిపారు. ఇది తుపానుగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

భారీ నుంచి అతి భారీ ...

అల్పపీడనం ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణింకి కూర్మనాథ్‌ అన్నారు. బుధవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక ఆయుధాలు

వేటకు వెళ్లొద్దు...

సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు పడే అవకాశాలుండడంతో పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు , పశువుల కాపరులు చెట్ల కింద కానీ, స్తంభాల వద్ద కానీ,ఖాళీ ప్రదేశాల్లో కానీ ఉండరాదని సూచించారు.

Also Read: కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి..సెమీస్‌ డౌటే

నైరుతి తిరోగమనం...

మహరాష్ట్ర,గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఒడిశా,అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ , మణిపూర్‌, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌ తో పాటు ఉత్తర బంగాళాఖాతం నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలుగుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఏపీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించేందుకు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Also Read: గుజరాత్‌లో 5వేల కోట్ల డ్రగ్స్ సీజ్

ఈ క్రమంలో ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అప్రమత్తంగా ఉండాలి...

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పోలీసు, విపత్తు నిర్వహణ శాఖలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోం మినిస్టర్‌ అనిత ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: బాబా సిద్ధిఖీహత్య కేసులో ట్విస్ట్..మైనర్ అనే అనుమానాలు

Advertisment
తాజా కథనాలు