'గుంటూరు కారం' టైటిలే తప్పు.. అసలు మేం అనుకున్న సినిమానే వేరు: నాగవంశీ

'గుంటూరు కారం' మూవీ రిజల్ట్ పై నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మేము అనుకున్న సినిమా వేరు. రివ్యూయర్స్‌ చూసిన యాంగిల్‌ వేరు. సినిమాకి టైటిల్‌ మైనస్‌ అయింది. ఫ్యామిలీ మూవీకి మాస్‌ టైటిల్‌ కరెక్ట్‌ కాదేమో అనిపించిందని అన్నారు.

g kaaram
New Update

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీ (Guntur Kaaram) ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ పై చాలానే విమర్శలు వచ్చాయి. 

Also Read : దేవిశ్రీ ప్రసాద్ ను వివాదంలోకి లాగిన సీఎం రేవంత్.. షాక్ లో ఫ్యాన్స్!

ఇదిలా ఉంటే యువ నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఈ సినిమా రిజల్ట్ పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అసలు సినిమాకు టైటిలే పెద్ద మిస్టేక్ అని అన్నారు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన 'లక్కీ భాస్కర్' సినిమా అక్టోబర్ 31 న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన 'గుంటూరు కారం' సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

Also Read : పవర్ స్టార్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా.. ఆకట్టుకునేలా మోషన్ పోస్టర్

ఈ మేరకు ఆ ఇంటర్వ్యూలో ఓ సీనియర్ జర్నలిస్ట్.. నాగవంశీని గుంటూరు కారం విషయంలో మీరు హ్యపీగా వున్నారా? అని అడిగారు. దానికి ఆయన బదులిస్తూ.." గుంటూరు కారం కమర్షియల్‌గా మాకు సేఫ్‌ ప్రాజెక్ట్‌. కేవలం నైజాం ఏరియాలోనే కొంత లాస్‌ అయ్యాం. ఇందులో అబద్దం ఏమీ లేదు. కావాలంటే మీరు కలెక్షన్లు తెలుసుకోండి. అది కూడా సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ వాళ్లు సొంత ఊర్లకు ఆంధ్రాకు వెళ్లిపోవడం వల్ల ఇక్కడ పెద్దగా ఆడలేదు.

Also Read : 'బాహుబలి 3' పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఏమన్నారంటే?

 రివ్యూలు కరెక్ట్‌ కాదు..

ఇక గుంటూరు కారం కంటెంట్‌ విషయంలో అందరం హ్యపీయే. ఆ విషయంలో ఏ తప్పు జరగలేదు. ఈ సినిమాకు వచ్చిన రివ్యూలు కూడా కరెక్ట్‌ కాదు. మేము అనుకున్న సినిమా వేరు. రివ్యూయర్స్‌ చూసిన యాంగిల్‌ వేరు. అందుకే సినిమా విషయంలో వాళ్లు మిశ్రమంగా స్పందించారు. అయితే 'గుంటూరు కారం' అనే టైటిల్‌ మైనస్‌ అయిందని అనుకుంటున్నాను. 

Also Read : 'పుష్ప 2' లో 'యానిమల్' విలన్.. సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడో?

టైటిలే మైనస్‌..

కుటుంబంతో కలిసి చూడదగ్గ ఫ్యామిలీ చిత్రానికి 'గుంటూరు కారం' అనే మాస్‌ టైటిల్‌ కరెక్ట్‌ కాదేమో అనిపించింది. అంతేకాదు ఇలాంటి ఫ్యామిలీ సినిమాకు మిడ్‌నైట్‌ ఒంటి గంట షో కూడా వేయకూడదు. ఈ సినిమా విషయంలో ఇలాంటి తెలియని పొరపాట్లు మాత్రమే జరిగాయి.." అని చెప్పుకొచ్చారు. దీంతో నాగవంశీ కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.

#mahesh-babu #guntur-kaaram-movie #producer-naga-vamsi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe