Naga Vamsi: దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి చూద్దాం.. చిటికెలు వేస్తూ సవాల్ విసిరిన నిర్మాత నాగవంశీ!

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంటే కొందరు దుష్పచారం చేస్తున్నారని నిర్మాత నాగవంశీ ఫైరయ్యారు. దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండని అన్నారు. మేము సినిమాలు తీస్తేనే వెబ్ సైట్లు, యూట్యూబ్‌లు బతుకుతాయని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

New Update
naga vamsi.

naga vamsi


ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రిలీజ్ అయిన 4 రోజుల్లోనే ఈ చిత్రం రూ.69.4 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాపై కొందరు దుష్పచారం చేస్తున్నారని నిర్మాత నాగవంశీ ఫైర్ అయ్యారు. 

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

ముఖ్యంగా సినిమా వెబ్ సైట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఈ సినిమాలో కంటెంట్ లేదని.. కేవలం సీక్వెల్ అడ్వాంటేజ్ మాత్రమే ఉందని కొందరు రాశారని ఆయన మండిపడ్డారు. సినిమాలో కామెడీ అంతగా పండలేదని చాలా సైట్లు రాసుకొచ్చాయని అన్నారు. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అంతేకాకుండా ఈ చిత్రం సాధించిన కలెక్షన్లు ఫేక్ అని.. కావాలనే మేకర్స్ కౌంట్ ఎక్కువ వేసి ప్రచారం చేసుకుంటున్నట్లు కొన్ని వెబ్ సైట్లు రాస్తున్నాయని.. ఆ వెబ్‌సైట్లపై ఆయన మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగానే మీడియాపై అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. దమ్ముంటే సినిమా కలెక్షన్లు ఫేక్ అని నిరూపించాలని సవాల్ విసిరారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

దమ్ముంటే బ్యాన్ చేయండి

ఈ మేరకు మీడియా రివ్యూయర్లపై ఫైర్ అయ్యారు. ‘‘మీకు మా మీద అంతగా పగ ఉన్నపుడు.. దమ్ముంటే మా సినిమాలను బ్యాన్ చేయండి. మా సినిమాల గురించి ఎవరూ ఆర్టికల్స్ గాని రివ్యూ గాని రాయకండి. నా దగ్గర యాడ్ తీసుకోకండి. దమ్ముంటే మమ్మల్ని బ్యాన్ చేయండి. చూసుకుందాం. మేము ఎలా మా సినిమాను ప్రమోట్ చేసుకోవాలో మాకు తెలుసు. మీ వెబ్ సైట్లు ప్రమోట్ చేస్తేనే మా సినిమాలు ఆడటం లేదు. మనమీద బతుకుతూ.. మనల్ని ఎందుకు చంపాలని చూస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

నేను సినిమా తీస్తేనే మీ వెబ్ సైట్ రన్ అవుతుంది. నేను ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానెల్స్ రన్ అవుతాయి. మేము యాడ్ ఇస్తేనే.. మీ వెబ్ సైట్స్ రన్ అవుతాయి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు.. లేకపోతే.. వెబ్ సైట్లు మూసుకుని ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి. 

(producer-nagavamsi | mad-square | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు