/rtv/media/media_files/2025/02/02/SeHBtrWLNHmqHOYpFuT2.jpg)
bunny vasu
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్.. ప్రస్తుతం సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని అరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. అయితే అతను త్వరగా కోలుకోవాలంటే మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు మొదటినుంచి చెబుతున్నారు.
ఈ క్రమంలో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఫిబ్రవరి 02వ తేదీన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ శ్రీతేజ్ ను వెళ్లి ఆయన పరామర్శించారు. అయితే శ్రీతేజ్ త్వరగా క్యూర్ కావాలంటే విదేశాలకు తీసుకువెళ్తే మంచిదని వైద్యులు బన్నీ వాసుకు సూచించినట్లగా తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు విదేశాలకు తీసుకుని వెళ్లాల్సి వస్తే.. అందుకు అయ్యే వైద్య ఖర్చులను తామే భరిస్తామని బన్నీ వాసు హామీ ఇచ్చినట్లు సమాచారం.
Producer Bunny Vasu visited Sri Tej, who is undergoing treatment at KEMS Hospital.
— ᴅᴀʀʀᴇɴ ʜᴏʟᴍᴇs🕸️🐕 (@BottleCot93883) February 2, 2025
Bunny Vasu expresses happiness over Sreetej's health deteriorating
The decision was to take Sritej abroad to provide him with even better treatment.#AlluArjun #Thandel pic.twitter.com/BK7ddF27Lv
2024 డిసెంబర్ 04వ తేదీన పుష్ప2 (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప2 మేకర్స్ అండగా నిలిచారు. హీరో అల్లు అర్జున్ కోటి రూపాయలు, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు తలో రూ. 50 లక్షల పరిహారం అందజేశారు.
అల్లు అర్జున్ పై కేసు నమోదు
అయితే ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. ఇది జరిగిన కాసేపటికే హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటిరోజు విడుదలయ్యారు.