Allu Arjun Visits KIMS Hospital || శ్రీతేజ్ మాట్లాడింది వింటే || Sritej Health Condition || RTV
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. అల్లు అర్జున్ వెంట నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు బన్నీ.
సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కలిసి శ్రీతేజ్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కి రూ.లక్షల చెక్ అందజేశారు.
కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే స్వయంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాడని తెలిపింది. తనంతట తాను ఫుడ్ కూడా తీసుకోగలుగుతున్నాడని వెల్లడించింది.