/rtv/media/media_files/2025/04/16/OYBT4iNZDqzzzJkkUlT1.jpg)
Krrish 4 Priyanka Chpora
Krrish 4: బాలీవుడ్ సూపర్ హీరోగా హృతిక్ రోషన్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సిరీస్ ‘క్రిష్’. విజువల్ వండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఫ్రాంచైజ్‌కి ఇప్పటికే మూడు భాగాలు వచ్చి భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ‘క్రిష్ 4’ కోసం హృతిక్ మరోసారి మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి విశేషమేమిటంటే, ఈ ప్రాజెక్ట్‌కు హృతిక్ రోషన్ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నాడు.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
ఈ సూపర్ హీరో చిత్రంలో మళ్లీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా కనిపించనుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో ‘క్రిష్’ సినిమాల్లో హృతిక్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రియాంకకు ‘క్రిష్ 4’ కథ వినగానే ఏంతో ఆసక్తితో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
రూ.30 కోట్లు డిమాండ్..!
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త కలకలం రేపుతోంది. ప్రియాంక ఈ సినిమా కోసం భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. తాను ‘క్రిష్ 4’లో నటించేందుకు రూ.30 కోట్లు అడిగిందన్న సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేనప్పటికీ, ఈ రూమర్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
ఇక బాలీవుడ్ మాత్రమే కాకుండా, ప్రియాంక టాలీవుడ్ లోను తన హవా చూపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..
ఇదిలా ఉండగా, హిందీలో కూడా ప్రియాంక మరో రెండు భారీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలతో ఈ ముద్దుగుమ్మ మరోసారి బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి తాజా ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు!