/rtv/media/media_files/2025/10/15/sreeleela-2025-10-15-13-29-55.jpg)
Sreeleela
Sreeleela: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న శ్రీలీల ఒక మంచి నటి మాత్రమే కాకుండా, గొప్ప మనసున్న వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. తక్కువ వయసులోనే పలు విజయవంతమైన సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న శ్రీలీల, వ్యక్తిగత జీవనంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
Also Read:రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
20 ఏళ్లకే అమ్మగా ..
2021లో శ్రీలీల తన 20వ ఏటే ఇద్దరు అంగవైకల్యం ఉన్న పిల్లలను అనాథ ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. ఈ ఇద్దరు పిల్లలకు గురు, శోభిత అనే పేర్లు పెట్టింది. శ్రీలీల చేసిన ఈ పనికి ఆ సమయంలో చాలామందిని ప్రభావితం చేసింది. తానొక సినీ తారగానే కాకుండా, ఒక అమ్మగా జీవించేందుకు ముందడుగు వేయడం నిజంగా ప్రశంసనీయమైంది.
మూడో బిడ్డ రాకతో మరోసారి వార్తల్లోకి
2025లో శ్రీలీల తన కుటుంబంలో మూడో బిడ్డ రాకను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈసారి ఇది గుట్టుగా కాకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలు షేర్ చేస్తూ ఆమె ఓ అందమైన మెసేజ్ పోస్ట్ చేశారు "Addition to the house. Invasion of the hearts… To more suffocating smothering."
ఇది ఆమె బిడ్డ పట్ల ఉన్న ప్రేమను చూపించింది.
Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!
శ్రీలీల తన నటనా ప్రస్థానాన్ని కన్నడ చిత్రం KISSతో ప్రారంభించారు. తెలుగు సినిమాలలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ‘రోబిన్‌హుడ్’ సినిమాలో కనిపించారు. నటిగా మాత్రమే కాకుండా, శ్రీలీల చదువులోనూ ప్రతిభ చూపించారు. 2021లో ఆమె MBBS పూర్తి చేశారు. అంతేకాకుండా, భరతనాట్యం నృత్యంలో శిక్షణ పొందారు.