SARZAMEEN TRAILER: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తెరంగేట్రం చేస్తున్న 'సర్‌జమీన్' ట్రైలర్ విడుదలైంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్ కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్‌లో ఇబ్రహీం తన లుక్, నటనతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.
Yahaan har faisla ek kurbani hai, desh ki ya apno ki… kuch aisi Sarzameen ki kahaani hai🇮🇳#Sarzameen, releasing July 25, only on #JioHotstar#SarzameenOnJioHotstar@PrithviOfficial@itsKajolD#IbrahimAliKhan#KaranJohar@adarpoonawalla@apoorvamehta18@AndhareAjit@kayoze… pic.twitter.com/qMDDJA19Vq
— JioHotstar (@JioHotstar) July 4, 2025
Also Read:Mouni Roy: ఆకుపచ్చ చీరలో నడుమందాలు చూపిస్తూ మౌని గ్లామర్ షో! ఫొటోలకు ఫిదా అవ్వాల్సిందే
ట్రైలర్
పృథ్వీరాజ్ మిలిటరీ అధికారి పాత్రలో కనిపించగా.. కాజోల్ అయన భార్య మీరా పాత్రలో నటించారు. అలాగే ఇబ్రహీం ఉగ్రవాదిగా కనిపించాడు. మిలిటరీ ఆఫీసర్ కుమారుడైన ఇబ్రహీం తన తండ్రికి వ్యక్తిరేకంగా ఎందుకు మారాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. కాజోల్ ఒక తల్లి పాత్రలో భావోద్వేగమైన నటనను ప్రదర్శించింది. ఆమె ఎమోషనల్ సీన్స్ సినిమాకు బలంగా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
Also Read:Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. స్టిల్స్ పిచ్చేక్కించేసిందిగా!
నేరుగా ఓటీటీలో
శ్రేయాస్ కె. ఎం. తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. జులై 25నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సుషెల్ రావల్, సంజయ్ శెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'సర్‌జమీన్' అంటే ఉర్దూలో 'మా భూమి' లేదా 'మా దేశం' అని అర్థం. ఈ సినిమా దేశభక్తి, కుటుంబ బంధాలు, త్యాగాల నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది.
Also Read:Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!