/rtv/media/media_files/2025/02/11/7vf19RfABjmnPTILnf7p.jpg)
Prithvi raj health
Prithvi raj : సినీ నటుడు పృథ్వీరాజ్ ఆస్పత్రిపాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సీరీయస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. హై బీపీతో రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పృథ్వీరాజ్ హెల్త్ కి సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
— Telangana Express (@XpressTG) February 11, 2025
హైబీపీతో ఆసుపత్రిలో చేరిన సీని నటుడు పృథ్వీ రాజ్#YSRCPSOCIALMEDIA #Laila #PruthviRaj #VishwakSen #YSRCPSM pic.twitter.com/YDiBIgm2Ws
వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ..
ఇదిలా ఉంటే ఇటీవలే విశ్వక్ సేన్ 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ వైసీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఏకంగా 'బాయ్ కాట్ లైలా' అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ తో దాదాపుగా 25 వేల పైగా ట్వీట్లు చేశారు. దీంతో ఈ ఘటనపై హీరో విశ్వక్ స్పందించారు. పృథ్వీ రాజ్ వ్యాఖ్యలకు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఒకరు చేసిన తప్పుకు తమను ఎందుకు బలి చేస్తున్నారని. ఆయన మాట్లాడిన మాటలకు తమకు ఎలాంటి సంబంధం లేని తెలిపారు. 'లైలా' సినిమాను చంపేయకండి అని విశ్వక్ అభిమానులను కోరారు.
అయితే 'లైలా' ప్రీ రిలీజ్ లో పృథ్వీ మాట్లాడుతూ ఇన్ డైరెక్ట్ గా వైసీపీపై సెటైర్లు వేశారు. ఒక వ్యక్తిని మేకల మంద దగ్గరకు తీసుకెళ్లి ఎన్ని ఉన్నాయ్ రా అని అడిగితే.. మొత్తం 150 మేకలు ఉన్నాయని.. ఇక సినిమా అయిపోయే మరోసారి కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయి అని చెప్పాడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వైసీపీ ఫ్యాన్స్ ‘‘బాయ్ కట్ లైలా’’ అనే ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.
Also Read: Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?