#Suriya46: జాక్ పాట్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. సూర్యకు హీరోయిన్ గా!

వెంకీ అట్లూరి - సూర్య కాంబోలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాకు క్లాప్ కొట్టారు. ఇందులో ఫీమేల్ లీడ్ గా ప్రేమలు బ్యూటీ మమిత బైజు ఛాన్స్ కొట్టేసింది.

New Update

Suriya46:   కోలీవుడ్ స్టార్ సూర్య ఇటీవలే  'రెట్రో'  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తిక్ సుబ్బారాజు తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత  సూర్య టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరీతో ఓ ప్రాజెక్ట్  అనౌన్స్  చేసిన సంగతి తెలిసందే.

మొదలైన సినిమా..

కాగా, తాజాగా ఈ సినిమాను పట్టాలెక్కించారు. సోమవారం పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి, సూర్య, త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ, జీవీ ప్రకాష్, మమిత బైజు తదితరులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మాత నాగవంశీ డైరెక్టర్ చేతికి స్క్రిప్ట్ అందించగా.. త్రివిక్రమ్ నటీనటులపై క్లాప్ కొట్టారు. #సూర్య 46 వర్కింగ్ టైటిల్ తో సినిమాను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. 

ప్రేమలు బ్యూటీ జాక్ పాట్ 

ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా పాపులరైన యంగ్ బ్యూటీ మమిత బైజు వరస ఆఫర్లను అందుకుంటోంది. కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోలతో జతకట్టే ఛాన్స్ కొట్టేస్తుంది. ఇప్పటికే దళపతి విజయ తో కలిసి 'జన నాయగన్' సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సూర్యకు జోడీగా ఎంపికైంది. #సూర్య 46 లో ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. 

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. లక్కీ భాస్కర్,  వాతి సినిమాల తర్వాత జీవీ ప్రకాష్, వెంకీ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. లక్కీ భాస్కర్ సక్సెస్ తర్వాత వెంకీ నుంచి రాబోతున్న ఈమూవీ పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి. 

cinema-news | latest-news | telugu-news | actress-mamita-baiju | suriya-venky atluri 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు