/rtv/media/media_files/2025/02/23/6pEjIydirFBmhWj6nC41.jpg)
Return of the Dragon Movie
Return of the Dragon Movie: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan).. లవ్ టుడే మూవీ(Love Today)తో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైనా ఈ తమిళ్ హీరోకు వరుస హిట్లు వరిస్తున్నాయి. లవ్ టుడే తెలుగు తమిళ్ రెండిటిలో సూపర్ హిట్ కాగా, తాజాగా విడుదలైన డ్రాగన్ చిత్రంతో మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. తమిళంలో అయితే భారీ వసూళ్లను నమోదు చేస్తూ దూసుకుపోతుంది. కొలీవుడ్ ట్రేడ్ అంచనా ప్రకారం, లవ్ టుడేని కూడా దాటే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే తమిళనాడు అన్ని ప్రధాన సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఏపీ, తెలంగాణలో కూడా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.
Also Read: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
చాలా మంది ప్రదీప్ ని ముద్దుగా జూనియర్ ధనుష్ అని పిలుచుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రదీప్, కోమలి అనే కమర్షియల్ చిత్రంతో మంచి విజయాన్ని సాధించాడు. తరువాత, స్వయంగా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు, డ్రాగన్ చిత్రం ద్వారా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!
లవ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్..
ప్రస్తుతం, లవ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ మూవీని పట్టాలెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది, నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.
విజయ్ సేతుపతి, ధనుష్ లాగానే, ప్రదీప్ రంగనాథన్ కూడా త్వరలో స్టార్ గా తనాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడంలో సందేహమే లేదు. రోజు రోజుకి యూత్ ఫాలోయింగ్ పెరుగుతోంది ఈ హీరోకి. తాజాగా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు ఈ యంగ్ హీరో.
Also Read: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!
ఈ వీకెండ్ పోటీకి వేరే సినిమాలు ఏవి లేకపోవడం కూడా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ విజయానికి ప్లస్ అయ్యింది. ఈ వీకెండ్ కాసుల వర్షం కురిపించి తన గత సినిమా లవ్ టుడే కలెక్షన్స్ ని క్రాస్ చేస్తాడో లేదో చూడాలి మరి.
Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!