/rtv/media/media_files/2025/10/15/dude-bookings-2025-10-15-10-18-38.jpg)
Dude Bookings
Dude Bookings: యూత్‌ఫుల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కొత్త సినిమా "డూడ్" విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి రెండు సినిమాలతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రదీప్, ఇప్పుడు డుడ్ మూవీతో మరింత హైప్ క్రియేట్ చేశాడు.
ఈ సినిమాకు కీర్తిశ్వరణ్ దర్శకత్వం వహిస్తుండగా, మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కీలక పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ (Dude Telugu Trailer)
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ హిట్ అయింది. ఇది కేవలం వినోదాత్మక సినిమా కాదు, కుటుంబ విలువలు కలిగిన కథ కూడా ఇందులో ఉంటుందని ట్రైలర్ చుస్తే అర్థమవుతోంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన ట్యూన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడం కూడా సినిమాపై హైప్ పెంచింది.
Also Read: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?
అమెరికాలో బుకింగ్స్ ఓ రేంజ్‌లో
అమెరికాలో ప్రీమియర్ షోలకు ముందుగానే మంచి బుకింగ్స్ దక్కాయి. ఇప్పటివరకు దాదాపు $60K డాలర్లు ప్రీ-సేల్స్ ద్వారా వచ్చినట్టు సమాచారం. అందులో తెలుగు వెర్షన్ ఒక్కటే $32K వసూలు చేయడం విశేషం. అదే సమయంలో తమిళ వెర్షన్ కి $28K మాత్రమే వచ్చాయి.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
ఇది చూస్తే తెలుగు ప్రేక్షకులలో ప్రదీప్‌కు ఎంతగానో క్రేజ్ ఉందన్న విషయం స్పష్టమవుతుంది. గతంలో "లవ్ టుడే" వంటి సినిమాల విజయంతో ఆయన్ను తెలుగు ప్రేక్షకులు దగ్గర చేసుకున్నారు. అందుకే "డూడ్" కూడా ఇక్కడ మంచి బిజినెస్ చేసింది.
Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!
వెరైటీ కంటెంట్‌తో..
ఈ సినిమా కథలో యూత్ ఫన్‌కి తోడు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే, కొత్తగా, విభిన్నంగా కథ ఉండనుందన్న ఫీల్ ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇదే బజ్‌తో రిలీజ్ తర్వాత రివ్యూలు కూడా పాజిటివ్ వస్తే, డూడ్ సినిమా బయ్యర్లకు మంచి లాభాలను అందించగలదు. మొత్తంగా "డూడ్" సినిమా ఇప్పటికే బుకింగ్స్‌తోనే హిట్ టాక్ తెచ్చుకుంటోంది. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి చూస్తే, సినిమా విడుదల తర్వాత పెద్ద హిట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Follow Us