Dude Collections: ఇచ్చిపడేసావ్ 'డ్యూడ్'.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘డ్యూడ్’ సినిమా అక్టోబర్ 17న విడుదలై మంచి రెస్పాన్స్ పొందింది. ఫస్ట్ డే రూ.15-16 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఫన్, లవ్, ఎమోషన్స్ అన్ని ఉన్న ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ దీపావళి సీజన్‌లో కలెక్షన్లు పెరిగే అవకాశముంది.

New Update
Dude Collections

Dude Collections

Dude Collections: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా, మమితా బైజు కథానాయికగా, శరత్ కుమార్, రోహిణి, హ్రిధు హరూన్, సత్యలు ఇతర ప్రముఖ పాత్రలు పోషించిన ’డ్యూడ్’ సినిమా అక్టోబర్ 17, 2025న థియేటర్లలో విడుదలైంది. దర్శకుడు కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను న వీన్ ఎర్నేని, వై. రవి శంకర్‌లు మైథ్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. మ్యూజిక్‌ సాయి అబ్యాంకర్ అందించారు.

Also Read: వర్త్ వర్మా వర్తు..!! ‘డ్యూడ్’ సినిమా రివ్యూ ఇదిగో..!

ఈ సినిమా షూటింగ్ అనంతరం ప్రమోషన్స్ బాగా జరిగాయి. సినిమాకి రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. కామెడీ, లవ్ ఎమోషనల్ మూవీ అంటూ సినిమాకి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు.

Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!

Dude Collections..

ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే “డ్యూడ్” మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 15-16 కోట్ల కలెక్షన్స్ సాధించిందని టాక్ వినిపిస్తోంది, ముఖ్యంగా దీపావళి పండగ సీజన్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్ ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే..!

ప్రదీప్ రంగనాథన్‌కు ఇప్పుడు వరుసగా మూడు ‘రూ. 100 కోటి గ్రాస్’ మూవీస్ ఉండడం ఆసక్తికార విషయం. గత చిత్రాలు లవ్ టుడే, డ్రాగన్ మంచి హిట్స్ అందుకున్నాయి. అందువల్ల తెలుగులో కూడా ప్రదీప్ కు మంచి గుర్తింపు ఉంది.

ఇక సినిమా విషయానికొస్తే ఫుల్ ఫన్‌గా నడుస్తోంది. ముఖ్యంగా 2nd హాఫ్ కొంచెం సీరియస్‌ టచ్ తో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రదీప్ నటన, కమెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

మొత్తానికి, “డ్యూడ్” ఒక మంచి ఎంటర్‌టైనర్.. నవ్విస్తూ, ఏడిపిస్తూ సాగే మంచి ప్రేమకథగా థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి మరి ఈ సినిమా ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు