Dude Review: వర్త్ వర్మా వర్తు..!! ‘డ్యూడ్’ సినిమా రివ్యూ ఇదిగో..!

ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' సినిమాకి అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్‌ మంచి కామెడీగా సాగగా, సెకండ్ హాఫ్‌లో కామెడీతో పాటు మెసేజ్ కూడా ఇచ్చారు. ప్రదీప్, శరత్ కుమార్ పాత్రలు బాగున్నాయి. మొత్తంగా, ఇది ఒక మంచి దీపావళి ఎంటర్టైనర్.

New Update
Dude Review

Dude Review

Dude Review: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా, మమితా బైజు, శరత్ కుమార్, హ్రిధు హరూన్, రోహిణి, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డ్యూడ్’ సినిమా ఈరోజు (అక్టోబర్ 17, 2025) విడుదలైంది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించారు. ఇక ఈ సినిమా ఎలా ఉందొ ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం... 

ప్రదీప్ రంగనాథన్ ఇప్పటికే లవ్ టుడే, డ్రాగన్ వంటి హిట్లతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు డ్యూడ్ అనే కామెడీ, లవ్ అండ్ ఎమోషనల్ సినిమాతో వచ్చాడు. మమితా బైజు హీరోయిన్‌గా నటించింది.

కథ: 

గగన్ (ప్రదీప్) ఓ బ్రేకప్ అయిన కుర్రాడు. తన మరదలు కుందనాతో (మమితా బైజు) కలిసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నడుపుతుంటాడు. కుందనా అతనిపై తన ప్రేమను చెబుతోంది, కానీ వారి జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్లు:

ప్రదీప్ రంగనాథన్ కామెడీ సింపుల్‌గా బాగుంది. కామెడీ టైమింగ్, డైలాగ్స్, తనదైన శైలి ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగా కామెడీ పండిస్తుంది.

శరత్ కుమార్ పాత్రలో ట్విస్టులు ఉన్నాయి. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన నటన సినిమాకు బలంగా నిలుస్తుంది. మమితా బైజు కూడా తన పాత్రను బాగా పోషించింది. మొదటి భాగం నెమ్మదిగా మొదలైనా, 2nd హాఫ్ పూర్తయ్యేసరికి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.

మైనస్ పాయింట్లు:

సెకండ్ హాఫ్‌లో సినిమా ఒక మెసేజ్ చెబుతుందనే కోణంలోకి వెళుతుంది. కానీ ఇందులో ఎమోషన్ ఎఫెక్ట్ అంతగా వర్క్ అవ్వలేదు. ప్రదీప్ పాత్ర తీసుకునే డీసిషన్లు అందరికీ నచ్చకపోవచ్చు. కొంతమంది ప్రేక్షకులకు ఇది గతంలో వచ్చిన అల్లు అర్జున్ ఆర్య సినిమాను గుర్తు చేసేలా ఉంటుంది.

సాయి అభ్యంకర్ సంగీతం బాగుంది. 'బూమ్ బూమ్' పాటను మంచి టైమింగ్ లో వినిపించారు. కెమెరామన్ నికేత్ బొమ్మి పనితనం మెచ్చుకోవాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అధ్బుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా ఓకే.


మొత్తానికి, డ్యూడ్ ఒక మంచి ఎంటర్టైనర్. మొదటి భాగం మంచి ఫన్‌తో సాగుతుంది. రెండో భాగం కాస్త సీరియస్‌గా మారుతుంది. కాని ప్రదీప్ కామెడీ సినిమాను బాగానే నడిపిస్తుంది. కేవలం పూర్తి వినోదాన్ని ఆశించే వారికి ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, మెసేజ్ కావాలనుకున్న వారికి సెకండ్ హాఫ్ కూడా నచ్చేలా ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు