/rtv/media/media_files/2025/07/15/prabhas-f1-movie-2025-07-15-09-54-09.jpg)
Prabhas - F1 Movie
Prabhas - F1 Movie: హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్(Prasad Cinemas) కు రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) కలిసి బ్రాడ్ పిట్ నటించిన ‘F1’ సినిమా చూస్తూ కనిపించడంతో, థియేటర్లో వీరిని చూసి అభిమానులు షాక్ అయ్యారు. ప్రభాస్ ఇలా బయట కనిపించడం చాలా అరుదు కావడంతో ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
India's biggest star #Prabhas and our #PrashanthNeel Watching #F1TheMovie in Prasads Multiplex [PCX] 🔥🔥🔥 pic.twitter.com/BahuoWZNix
— Hail Prabhas (@HailPrabhas007) July 14, 2025
Also Read: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
అయితే అభిమానులు తీసిన ఈ ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా సినిమాల ప్రీమియర్‌లలో కనిపించే ఈ స్టార్స్, ఇలా సడెన్‌గా ఓ హాలీవుడ్ సినిమా చూస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
#Prabhas Watched #F1Movie in Prasad Cinemas. pic.twitter.com/Og8iYQuZzT
— Filmy Fanatic (@FanaticFilmy) July 15, 2025
ప్రబాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్ గత ఏడాది (2023) డిసెంబర్‌లో విడుదలై భారీ హిట్ అందుకుంది. ఆ విజయం తర్వాత అభిమానులు ఇప్పుడు సలార్ పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి బయట కనిపించడంతో సలార్ 2 పై మళ్ళీ వార్తలు ఊపందుకున్నాయి.
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
బ్రాడ్ పిట్ యొక్క F1 - స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా..
ఇక ‘F1’ సినిమా గురించి కొంచెం వివరాల్లోకి వెళితే, ఇది అమెరికన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. టాప్ గన్: మావరిక్ ఫేమ్ జోసఫ్ కోసిన్స్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెర్రీ బ్రక్‌హైమర్, చాద్ ఓమన్, ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్, లూయిస్ హామిల్టన్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
ఈ చిత్రంలో బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించగా, అతనితో పాటు డామ్సన్ ఇడ్రిస్, కెరీ కాండన్, జావియర్ బార్డెమ్, టోబియాస్ మెంజీస్, సారా నైల్స్, కిమ్ బోడ్‌నియా, సామ్సన్ కాయో కీలక పాత్రల్లో కనిపించారు. ఫార్ములా 1 ప్రపంచం ఆధారంగా రూపొందిన ఈ కథను FIA (Formula 1 Governing Body) తో కలిసినట్టుగా రూపొందించారు. ఈ చిత్రం జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్స్ - భారీ అంచనాలతో ‘స్పిరిట్’(Spirit Movie)..
ప్రభాస్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో త్రిప్తీ డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రభాస్ ఇందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.