Prabhas Salaar: ఇదిరా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్.. 366 రోజులు ట్రెండింగ్‌లోనే ‘సలార్’

విడుదలై ఏడాది గడిచినా ప్రభాస్ 'సలార్' హవా ఇంకా తగ్గలేదు. ఓటీటీలో 366 రోజులు నిరంతరం ట్రెండింగ్‌లో ఉన్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఏడాది పాటు టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా తన స్థానాన్ని నిలుపుకుంది.

New Update

విడుదలై ఏడాది గడిచినా  'సలార్' హవా ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. ఓటీటీలో 366 రోజులు నిరంతరం ట్రెండింగ్‌లో ఉన్న సినిమాగా అరుదైన మైలు రాయిని సాధించింది. సంవత్సరం పాటు మిలియన్ల వ్యూస్ తో  ఆధిపత్యం చెలాయిస్తోంది. టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా తన స్థానాన్ని నిలుపుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ''మునుపెన్నడూ లేని విధంగా పాలన @JioHotstarలో సంవత్సరం పాటు 'సలార్'  ఆధిపత్యం'' అంటూ ట్వీట్ చేశారు. 

ఓటీటీలో మాత్రమే కాదు టీవీ ప్రీమియర్స్ తోనూ రికార్డులను బద్దలు కొట్టింది. హిందీలో టీవీ ప్రీమియర్స్ లో ఊహించని విధంగా 30 మిలియన్ల ప్రేక్షకులను ఆకర్షించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ప్రభాస్ హీరోగా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా,  శ్రియ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సలార్ ఫ్రాంఛైజీలో రెండవ భాగం 'సలార్ పార్ట్ 2: శౌర్యంగ పర్వం'  2026 లో వెండితెరపైకి వచ్చే అవకాశం ఉంది.  ఈ యాక్షన్-ప్యాక్డ్ సాగాలోని తదుపరి అధ్యాయం కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 2 చిత్రీకరణ మొదలైనట్లు సమాచారం. 

Also Read: Malayalam Film Industry: మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే

Advertisment
Advertisment