/rtv/media/media_files/2025/11/02/raja-saab-song-2025-11-02-12-24-20.jpg)
Raja Saab Song
Raja Saab Song: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు “ది రాజా సాబ్” (The Raja Saab) సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తూనే, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఫౌజీ” (Fauzi) మూవీ కోసం కూడా శ్రమిస్తున్నాడు. అయితే, ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ది రాజా సాబ్.
ప్రభాస్ కెరీర్‌లో ఇది ఫస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మొదట్లో పెద్దగా అంచనాలు లేకపోయినా, ఇప్పుడు ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్‌లో ఆయన స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. రంగురంగుల పండుగ వాతావరణంలో ఉన్న ఈ పోస్టర్ చుస్తే సినిమా పక్కా ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది.
Also Read : భారత మాజీ స్టార్ క్రీడాకారుడు కన్నుమూత..
/rtv/media/post_attachments/indiatoday/inline-images/The Raja Saab-492806.jpg?VersionId=OKCqrjck5IaVZSwqDZebIjkOXg4EayT4&size=750:*)
పోస్టర్ రిలీజ్‌తో పాటు అభిమానుల్లో మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది “ది రాజా సాబ్” ఫస్ట్ సింగిల్ నవంబర్ 5న విడుదల కానుందని తెలుస్తోంది. దీనిపై నిర్మాత కూడా ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. అసలు పాట ముందే రావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యిందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
Also Read : బాబర్ ఆజామ్ సంచలనం: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు
ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు సంజయ్ దత్, బోమన్ ఇరానీ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం తమన్ అందించగా, ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా, జనవరి 9, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సహా హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
సంక్రాంతి సీజన్ ఎప్పుడూ పెద్ద సినిమాల పోటీ సమయం కావడంతో, “ది రాజా సాబ్” కూడా ఈ సంక్రాంతికి పోటీలో నిలవనుంది. కొత్త పోస్టర్లు, సింగిల్ అప్‌డేట్‌లు, ప్రమోషన్‌లతో సినిమా మీద ఉన్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
ప్రభాస్ మాస్ లుక్, తమన్ సంగీతం, హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్ అన్ని “ది రాజా సాబ్”ని హిట్ చేసేలాగా కనిపిస్తున్నాయి. మరి సంక్రాంతికి రాజా సాబ్ ఎలా సందడి చేస్తాడో చూడాలి.
Follow Us