Prabhas: యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ కు ప్రభాస్ ఓపెన్ ఆఫర్.. మీ దగ్గర మంచి కథ ఉందా?

ప్రభాస్ తాజాగా యువ రచయితలకు, దర్శకులకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. తన సోదరుడు ప్రమోద్ తో కలిసి 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' అనే సంస్థని స్థాపించాడు ప్రభాస్. దానికి సంబంధించి ప్రభాస్ నేడు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
fggvc

రెబల్ స్టార్ ప్రభాస్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే పనిలో పడ్డారు. తాజాగా ఆయన యువ రచయితలకు, దర్శకులకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభాస్ తన సోదరుడు ప్రమోద్ తో కలిసి 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' అనే సంస్థని స్థాపించాడు. దానికి సంబంధించి ప్రభాస్ నేడు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో ఓ  వీడియో ఉంది.. 

ప్రభాస్ బంఫర్ ఆఫర్..

ఈ వీడియోలో..' మీ దగ్గర మంచి కథలు ఉన్నా అవకాశం రావట్లేదా. మీ లాంటి వాళ్ళ కోసమే ఒక వెబ్ సైట్ తీసుకొస్తున్నాము. ఆ వెబ్ సైట్ లో మీ కథను లేదా సినాప్సిస్ ని అప్లోడ్ చేస్తే ఆడియన్స్ వాటికి రియాక్ట్ అవుతారు అని తెలిపారు. అలా ఎక్కువ రియాక్షన్స్ వచ్చిన మంచి కథలను సినిమా రూపంలోకి తీసుకొస్తామని..' తన పోస్ట్ ద్వారా చెప్పాడు ప్రభాస్.

Also Read : సాయి పల్లవికి కొత్త బిరుదు ఇచ్చిన నాగ చైతన్య.. ఏంటో తెలుసా?

ఈ వీడియోని మొత్తం ఐదు భాషల్లో పోస్ట్ చేశాడు. అంటేకేవలం తెలుగు వాళ్లే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న రైటర్స్ అండ్ డైరెక్టర్స్ కు ప్రభాస్ ఈ ఆఫర్ ఇస్తుండటం విశేషం. మీలో రచయితలు ఉంటే, డైరెక్టర్ గా ట్రై చేస్తుంటే https://www.thescriptcraft.com/ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి మీ కథను అప్లోడ్ చేయండి. మీ కథ సినిమాగా మారే ఛాన్స్ అందుకోండి. 

ప్రభాస్ ఇలా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంపై ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ సైతం ఆయన్ను అభినందిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే హను రాఘవ పూడి, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ప్రాజెక్ట్స్ కి కమిట్ అవ్వగా.. వీటిలో హను రాఘవ పూడి, స్పిరిట్ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోనున్నాయి.

Also Read : రిలీజ్ కు ముందే 'పుష్ప2' ఆల్ టైమ్ రికార్డ్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు