Ind vs Nz: న్యూజిలాండ్ క్లీన్ స్వీప్.. 0-3తో సిరీస్ కైవసం!

న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ పరాజయంపాలైంది. ముంబై వాంఖడే వేదికగా జరిగిన చివరి టెస్టులో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. 0-3తో న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. 

author-image
By srinivas
New Update
dedrersee

Ind vs Nz: న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ పరాజయంపాలైంది. ముంబై వాంఖడే వేదికగా జరిగిన చివరి టెస్టులో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. 0-3తో న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. 

కివీస్ బౌలర్లలో అజాజ్‌ పటేల్ (6/57), గ్లెన్ ఫిలిప్స్‌ (3/42), మాట్ హెన్రీ (1/10) భారత్ ను కూల్చారు. అజాజ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. భారత బ్యాటర్లలో రిషభ్‌ పంత్ (64) మినహా ఎవరూ రాణించలేదు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 పరుగులు చేయగా.. భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అజాజ్ పటేల్, ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును విల్‌ యంగ్‌ సొంతం చేసుకున్నారు.  

న్యూజిలాండ్‌ వరుసగా మూడు టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. భారత్‌ను వైట్‌వాష్‌ చేసిన నాలుగో జట్టుగా నిలిచింది కివీస్. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ చేతిలో భారత్‌కు వైట్‌వాష్‌ తప్పకపోగా.. అత్యల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ కాపాడుకోవడం ఇది రెండోసారి. ఓ టెస్టులో 200 కంటే తక్కువ టార్గెట్‌ను ఛేదించడంలో టీమ్ ఇండియా విఫలం కావడం ఇది 4వసారి. 

Advertisment
తాజా కథనాలు