నల్ల ప్యాంటు, గళ్ళ కోటు, టీ షర్ట్.. వాహ్! 'రాజా సాబ్' లుక్ అదిరిందయ్యా

'రాజా సాబ్' మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కానుక‌గా అప్‌డేట్ ఉండ‌బోతున్న‌ట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, లోప‌ల‌ టీ షర్ట్‌తోలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

rjasab
New Update

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'ది రాజా సాబ్' ఒకటి. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. అక్టోబ‌ర్ 23న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కానుక‌గా రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఉండ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌కటిస్తూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. 

Also Read :  ఆ కళ్ళు చూస్తే ఎవరైనా చూపు తిప్పుకోలేరు.. వైట్ డ్రెస్ లో హాట్ బేబీ క్యూట్ లుక్స్

వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్..

ఈ పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. గళ్ళ కోటు, నల్ల ప్యాంటు.. లోప‌ల‌ టీ షర్ట్‌తో ఉన్న డార్లింగ్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ను చూపిస్తా అని మారుతి ఓ సందర్భంలో అన్నారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. 'రాజా సాబ్' లేటెస్ట్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆయన గత సినిమాల్ని గుర్తు చేస్తుంది. 

Also Read :  ఏపీలో ఊహించని రాజకీయ పరిణామం.. రాజీకీ వచ్చిన జగన్, షర్మిల !

Also Read : నా సినిమా బాలేకపోతే థియేటర్ కు రాకండి.. విశ్వక్ సేన్ ఓపెన్ ఛాలెంజ్

పోస్టర్ లో ప్రభాస్ డెస్సింగ్ స్టైల్ చూస్తుంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మార్కెట్ లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. మొత్తంగా 'రాజా సాబ్' లేటెస్ట్ పోస్టర్ లో డార్లింగ్ లుక్ చూసి ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది. కాగా అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే రోజు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. 

Also Read : ప్రభాస్ బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ.. వైరల్ అవుతున్న ప్రోమో

#tollywood #prabhas #the-raja-saab-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe