/rtv/media/media_files/2024/10/21/1uYehviGCxKr8xELduK8.jpg)
డార్లింగ్ ప్రభాస్ ఇంటర్వూలకు ఎంతో దూరంగా ఉంటాడు. ఎందుకంటే రెబల్ స్టార్ కు మొహమాటం ఎక్కువ. అందుకే ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వడు. ఏదో సినిమా ప్రమోషన్ లో తప్పితే.. బయట ఎక్కువగా మాట్లాడడు. అప్పుడెప్పుడో బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ టాక్ షోల్లో పాల్గొన్న డార్లింగ్.. మళ్ళీ ఇప్పటిదాకా ఇతర టాక్ షోలకు వెళ్ళలేదు. అయితే ప్రభాస్ బర్త్ డే రోజు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతుంది.
తాజాగా దాని తాలూకు ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ.. 'నా ఉఛ్వాసం కవనం' అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తుంది. గతంలో ఈ ఇంటర్వ్యూకి గతంలో పలువురు సెలబ్రిటీలు రాగా.. తాజాగా ప్రభాస్ కూడా వచ్చాడు. ఇప్పటికే ఈ ఇంటర్వ్యూ షూట్ అవ్వగా తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.
Dear Darling Fans,
— ETV Win (@etvwin) October 21, 2024
The wait is over 😉...
Stay tuned to @etvwin
Ma team Sunday antunnaru mari 👀
5k retweets vasthe munde release chesta 🤭😉#Prabhas #Etvwin pic.twitter.com/NHfDgeKEaW
Also Read : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు?
ఈ ప్రోమోలో ప్రభాస్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో ఉన్న అనుబంధం, ఆయన రాసిన పాటల గురించి, ఆయన సాహిత్యం గురించి మాట్లాడారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. కాగా ఈ ఇంటర్వ్యూకు సంబందించిన ఫుల్ ఎపిసోడ్ ను ఈటీవీ ప్రతీ ఆదివారం రిలీజ్ చేస్తుంది.
Also Read : సెల్ఫ్ ఎలిమినేట్ అయిన మణికంఠ.. 7 వారాల్లో అన్ని లక్షలు సంపాదించాడా?
బర్త్ డే స్పెషల్ గా..
అయితే ఈసారి అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే ఉండటంతో అదే రోజు ఈ ఇంటర్వ్యూని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ప్రభాస్ బర్త్ డే కానుకగా థియేటర్స్ లో డార్లింగ్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్, ఈశ్వర్, రెబల్, సలార్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అక్టోబర్ 22, 23 తేదీల్లో ఈ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.