/rtv/media/media_files/2025/04/12/SpJr0ttu3G0T3Z5RITiE.jpg)
Retro Movie Pooja Hegde
Pooja Hegde: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్ ‘రెట్రో’(Retro) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాక్షన్ డ్రామాను ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. 1980ల కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకొని రూపొందుతున్న ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
Also Read: ఇకపై అంతా చీకట్లోనే.. షాకిచ్చిన్న నేషనల్ క్రష్..
మే 1న 'రెట్రో' గ్రాండ్ రిలీజ్
ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమాను మే 1న తెలుగుతో పాటు తమిళ భాషలో పాన్ రీజినల్ రీతిలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్, గ్లింప్స్ ప్రేక్షకుల నుండి భారీ స్పందనను రాబట్టాయి. దీంతో 'రెట్రో'పై ఆడియన్స్ అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా సూర్య- పూజా హెగ్డే కాంబినేషన్ చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
ఇక తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రెట్రో మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ అప్‌డేట్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది.
/rtv/media/media_files/2025/04/12/9QV7X9KEcrs50pmEy3zm.webp)
Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్
సూర్య స్టైల్, కార్తీక్ సుబ్బరాజ్ విజన్, పూజా హెగ్డే గ్లామర్ మేళవింపుతో 'రెట్రో' ఈ సమ్మర్‌లో ఓ మోస్ట్‌వాంటెడ్ మూవీగా మారిందనడంలో సందేహమే లేదు.